Home » Author »Narender Thiru
ఐఫోన్ 14 కొనాలనుకుంటున్నారా? తక్కువ బడ్టెట్‌లో ఏదైనా దేశం వెళ్లొద్దామని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే, ఐఫోన్ 14 కొనే డబ్బులతోనే కొన్ని దేశాలు తిరిగి రావొచ్చు. అదే ఫోన్ ధరతోనే ఈ దేశాలు సందర్శించి రావొచ్చు. అలాంటి కొన్ని దేశాలివి.
వీధి కుక్కలకు ఆహారం అందించే వారు... ఇకపై అవి ఎవరినైనా కరిస్తే బాధ్యత తీసుకోవాలని సూచించింది భారత సుప్రీంకోర్టు. వాటికి వ్యాక్సినేషన్ కూడా చేయించాలని ఆదేశించింది.
దుబాయ్ నుంచి వారం క్రితమే వచ్చిన కొడుకును తండ్రి గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా, భీంగల్ మండలంలో జరిగింది. కొడుకు దుబాయ్ నుంచి పంపించిన డబ్బు గురించి తండ్రిని ప్రశ్నించినందుకే ఈ దాడికి పాల్పడ్డాడు.
అవినీతి కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ)ని కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కర్ణాటక హైకోర్టు కూడా ఇదే రకమైన తీర్పు ఇచ్చింది.
సఫారికి వెళ్లిన టూరిస్టులకు భయానక పరిస్థితి ఎదురైంది. ఒక పెద్ద ఏనుగు వారి జీప్‌ను తరిమింది. జీప్ ఎదురుగా ఉన్న ఏనుగు వెంట పడటంతో డ్రైవర్ రివర్స్‌లో వేగంగా వెనక్కు తీసుకెళ్లాడు.
‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా రాహుల్ గాంధీ ధరించిన టీ షర్ట్ ధర విషయంలో బీజేపీ-కాంగ్రెస్ మధ్య సోషల్ మీడియా వేదికగా రచ్చ నడుస్తోంది. మోదీ కూడా రూ.10 లక్షల ఖరీదైన సూటు ధరించారంటూ కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది.
బ్రిటన్ రాజుగా బాధ్యతలు స్వీకరించబోతున్న చార్లెస్-3కి బ్రిటన్ రాజవంశ చట్టాల ప్రకారం కొన్ని ప్రత్యేక హక్కులున్నాయి. ఈ హక్కుల ప్రకారం... ఆయనకు పాస్‌పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఉండదు.
ఇండియా నుంచి భారీ స్థాయిలో పత్తి దిగుమతి చేసుకోవాలని పాక్ వ్యాపారులు అక్కడి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎందుకంటే ఆ దేశంలో వరదల కారణంగా పత్తి చాలా వరకు పాడైంది. దిగుమతి కూడా తగ్గిపోనుంది.
22 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న సిద్ధిక్ అనే జర్నలిస్టుకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. హత్రాస్‌లో జరిగిన ఒక అత్యాచార కేసులోని రహస్యాలను వెలికితీసేందుకు వెళ్తుండగా పోలీసులు అతడ్ని 2020లో అరెస్టు చేశారు.
అమరావతి రైతుల పాదయాత్ర విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పాదయాత్రకు అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 12 నుంచి అమరావతి రైతుల మహాపాదయాత్ర ప్రారంభం కానుంది.
బ్రిటన్ రాణిగా ఉన్న క్వీన్ ఎలిజబెత్-2 గురువారం మరణించిన సంగతి తెలిసిందే. 70 ఏళ్ల ఆమె పాలనలో ఎన్నో విశేషాలున్నాయి. అత్యధిక కాలం పాటు బ్రిటన్ రాణిగా కొనసాగడంతోపాటు, మరెన్నో అరుదైన విశేషాల్ని సొంతం చేసుకున్నారు.
అక్రమంగా నిర్మించిన రెస్టారెంట్‌ను బుల్డోజర్లతో కూల్చేసేందుకు సిద్ధంగా ఉన్నారు అధికారులు. కానీ, సుప్రీంకోర్టు దీనిపై అత్యవసర విచారణ జరిపి స్టే విధించింది. దీంతో చివరి నిమిషంలో కూల్చివేత ప్రక్రియ నిలిచిపోయింది.
పెళ్లి జరిగినప్పుడు ఆమె వయసు 1. ఏమీ తెలియని పసితనంలో, 20 ఏళ్ల క్రితం జరిగింది ఈ పెళ్లి. దీంతో తమ కుమారుడితో కాపురం చేయాలని అత్తమామలు ఆ యువతిని వేధించారు. దీనికి ఇష్టంలేని ఆ యువతి ఎన్జీవో సాయంతో కోర్టును ఆశ్రయించింది.
అమెరికాలో ఉన్న మీ సన్నిహితులు, కుటుంబ సభ్యుల ద్వారా ఐఫోన్ 14 తెప్పించుకుందాం అనుకుంటే తర్వాత ఫీలవుతారు. ఎందుకంటే కొత్తగా అమెరికన్ మార్కెట్లోకి రాబోతున్న ఐఫోన్ 14లో సిమ్ ట్రే ఉండదు. మన దేశంలో రిలీజయ్యే ఫోన్లలో మాత్రం సిమ్ ట్రే ఉంటుంది.
బాలాపూర్ గణేష్ లడ్డు వేలం గత రికార్డులు తిరగరాస్తూ భారీ ధరకు అమ్ముడైంది. రూ.24.60 లక్షలకు ఈ ఏడాది లడ్డూ అమ్ముడైంది. లక్ష్మారెడ్డి అనే వ్యక్తి ఈ లడ్డూను దక్కించుకున్నాడు.
క్వీన్ ఎలిజబెత్ తర్వాత బ్రిటన్ రాజుగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు ఆమె పెద్ద కుమారుడు ప్రిన్స్ ఛార్లెస్. ఆయన వయసు 73 సంవత్సరాలు. అదిపెద్ద వయసులో ఈ బాధ్యతలు స్వీకరించబోతున్నారు ప్రిన్స్ ఛార్లెస్.
భారత స్టార్ అథ్లెట్ మరో భారీ విజయాన్ని అందుకున్నారు. స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్‌లో జరిగిన డైమండ్ ట్రోఫీలో విజేతగా నిలిచారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచారు.
ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన ఒక వైద్యుడు అమానుషంగా ప్రవర్తించాడు. బాలుడితో కాళ్లు పట్టించుకున్నాడు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో అధికారులు స్పందించి అతడికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
హాయిగా నిద్రపోయినందుకు రూ.5 లక్షల బహుమతి గెలుచుకుంది ఒక యువతి. 100 రోజులపాటు, రోజూ కనీసం తొమ్మిది గంటలు నిద్రపోయి ఈ బహుమతి గెలుచుకుంది. ఆమె పేరు త్రిపర్ణా చక్రవర్తి. ఇంతకీ ఈ పోటీ ఎందుకంటే...
వైవాహిక జీవితంలో గొడవల కారణంగా జంటలు క్షణికావేశంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. గొడవల కారణంగా గుజరాత్లో ఒక జంట ఆత్మహత్యకు పాల్పడింది. తమ చిన్నారితో కలిసి 12వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.