Home » Author »Narender Thiru
పాకిస్తాన్లో వరదల వల్ల భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆ దేశంలో దాదాపు 1,290 మంది మరణించగా, 6 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మొత్తం మూడు కోట్ల మంది ప్రజలపై ఈ ప్రభావం ఉంది.
‘భారత్ జోడో యాత్ర’ వచ్చే బుధవారం నుంచే ప్రారంభం కానుంది. ఆ రోజు భారీ సభ, ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం గురువారం ఉదయం ఏడు గంటలకు యాత్ర మొదలవుతుంది. ఈ కార్యక్రమం మోదీ చేపట్టిన ‘మన్ కీ బాత్’ లాంటిది కాదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. స్థానిక రష్యన్ ఎంబసీ వద్ద జరిగిన బాంబు దాడిలో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఝార్ఖండ్ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో సీఎం హేమంత్ సోరెన్ ఆధ్వర్యంలోని జేఎమ్ఎమ్ కూటమి విజయం సాధించింది. సోమవారం మధ్యాహ్నం ఈ విశ్వాస పరీక్ష జరిగింది. 81 స్థానాలున్న అసెంబ్లీలో హేమంత్ సర్కారుకు అనుకూలంగా 48 ఓట్లు పోలయ్యాయి.
వాట్సాప్, గూగుల్ మీట్ వంటి సంస్థలు వాయిస్ ఆధారిత కాల్స్‌ను ఉచితంగా అందిస్తుండటంపై టెలికాం కంపెనీలు భగ్గుమంటున్నాయి. ఈ సేవలకు కూడా ఆయా సంస్థల నుంచి లైసెన్స్ ఫీజు వసూలు చేయాలి అని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టిం�
కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్ అయితే, మొత్తం నీటితో నిండిపోయింది. నీటి ప్రవాహంలో చిక్కుకున్న వారిని అధికారులు రక్షిస్తున్నారు.
యూపీలోని లక్నోలో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం స్థానిక హోటల్లో అగ్నిప్రమాదం కారంణంగా మంటలు చెలరేగాయి. దీంతో హోటల్ గదుల్లో ఉన్న వారిలో ఇద్దరు మరణించారు. మరో పది మంది గాయపడ్డారు.
విమర్శల్ని పట్టించుకోబోనని, వాళ్లకు సమాధానం చెప్పడంకంటే బాగా ఆడటంపైనే దృష్టి పెడతానని చెప్పారు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. 120 శాతం బాగా ఆడేందుకే ప్రాధాన్యం ఇస్తానన్నారు. టెస్టు కెప్టెన్సీ వదిలేసినప్పుడు తనకు కాల్ చేసింది ధోనీ ఒక్కరేన�
జిమ్‌లో ఒంటరిగా వర్కవుట్ చేస్తున్న ఒక మహిళ ఎక్విప్‌మెంట్‌లో చిక్కుకుపోయింది. తన కాలు అందులో ఇరుక్కోవడంతో తలకిందులైంది. సాయం చేసే వాళ్లెవరూ లేకపోవడంతో ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రిక�
తమిళనాడులో దారుణం జరిగింది. పదకొండో తరగతి చదువుతున్న బాలిక స్కూల్లోనే ప్రసవించింది. తర్వాత చిన్నారిని స్కూలు పక్కనున్న పొదల్లో దాచేసి వెళ్లిపోయింది. అయితే, ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సోమవారం నుంచి నాలుగు రోజులపాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును, ప్రధాని మోదీని కలిసి అనేక అంశాలపై చర్చలు జరుపుతారు.
మొహాలీలో ఒక జెయింట్ స్వింగ్ కిందికి జారిపడిపోయిన ఘటనలో 16 మంది మహిళలకు గాయాలయ్యాయి. మరికొందరు చిన్నారులు కూడా గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బీజేపీకి 50 సీట్లే వస్తాయని వ్యాఖ్యానించిన బిహార్ సీఎం నితీష్ కుమార్ యూటర్న్ తీసుకున్నారు. తానెప్పుడూ బీజేపీ సీట్ల సంఖ్య గురించి మాట్లాడలేదన్నారు. దీంతో 24 గంటలు కూడా గడవక ముందే మాట మార్చిన నితీష్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ మృతిపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక అందించాలని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పోలీసులను ఆదేశించారు. ఈ అంశంపై డీజీపీతో మాట్లాడినట్లు తెలిపారు.
బతికుండానే ఒక వృద్ధుడు చనిపోయినట్లు రికార్డుల్లో నమోదు చేశారు ప్రభుత్వ అధికారులు. దీంతో ఆ వృద్ధుడికి పెన్షన్ ఆగిపోయింది. బ్యాంకు లావాదేవీలు కూడా నిలిచిపోయింది. ఇవన్నీ కావాలంటే బతికే ఉన్నట్లు సర్టిఫికెట్ తెచ్చుకోవాలి అంటున్నారు అధికారుల�
రీల్స్ కోసం వీడియో తీస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడో యువకుడు. వరంగల్ జిల్లాకు చెందిన అజయ్ అనే ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి, రైలు పట్టాల వద్ద రైలు వస్తుండగా ఒక వీడియో తీసేందుకు ప్రయత్నించాడు. అయితే, రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
దేశంలో డిజిటల్ విప్లవానికి నాంది పలికిన రిలయన్స్ జియో ప్రారంభమై సోమవారానికి ఆరేళ్లు. తక్కువ ధరలోనే డేటా, వాయిస్ కాల్స్ అందిస్తూ సరికొత్త విప్లవానికి తెరతీసింది జియో. వచ్చే దీపావళికి 5జీ సేవలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే అందరూ బాధ్యతగా ఉండాలి. ఈ విషయాన్ని సూచిస్తూ టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఒక వీడియో షేర్ చేశారు. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఆ వీడియోను మీరూ చూడండి.
Singer Vaishali Bursala : ఇటీవల హత్యకు గురైన పంజాబీ సింగర్ వైశాలి బుర్సాలాను చంపించింది ఆమె స్నేహితురాలే. తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయమని వైశాలి బలవంతం చేయడంతో ఆమెను హత్య చేసేందుకు నిర్ణయించుకుంది ఆ స్నేహితురాలు.
ప్రముఖ వ్యాపారవేత్త షాపూర్జి పల్లోంజి కుమారుడే సైరస్ మిస్త్రీ. 1991లో తన తండ్రికి చెందిన షాపూర్జీ పల్లోంజీలోకి డైరెక్టర్‌గా వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. అనంతరం క్రమంగా ఎదుగుతూ ‘టాటా సన్స్’ ఛైర్మన్‌గా మారారు. అయితే, అనంతరం జరిగిన పరిణామా