Home » Author »Narender Thiru
ప్రతిష్టాత్మక ‘రామన్ మెగసెసే’ అవార్డును నిరాకరించారు కేరళకు చెందిన సీపీఎం మహిళా నేత. తానో రాజకీయ నాయకురాలు కావడం వల్ల, పార్టీ హై కమాండ్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
ప్రముఖ వ్యాపారవేత్త, ‘టాటా సన్స్’ గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ వద్ద, ఆదివారం మధ్యాహ్నం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
లండన్‌లో కనిపించకుండా రెండు కోట్ల రూపాయలకు పైగా విలువైన బెంట్లీ కారు పాకిస్తాన్లో దొరికింది. లండన్ అధికారులు ఇచ్చిన సమాచారంతో ఈ కారును పాకిస్తాన్లో అక్కడి అధికారులు గుర్తించారు. ఇంతకీ ఆ కారు పాకిస్తాన్లో ఉన్నట్లు ఎలా తెలిసిందంటే..
దేశాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ విభజించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మోదీ పాలనలో ఇద్దరు టైకూన్లకు మాత్రమే మేలు జరిగిందని, ప్రజలు భయాందోళనల మధ్య బతకాల్సి వస్తోందన్నారు.
తాను కాంగ్రెస్ పార్టీకి రక్తం ధారపోస్తే, ఆ పార్టీ తాను చేసిన సహాయాన్ని మర్చిపోయిందని విమర్శించారు గులాంనబీ ఆజాద్. కొత్త పార్టీ పెట్టబోతున్న ఆయన జమ్ము-కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు.
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌కు, కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేసిన సీరమ్ సంస్థకు బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తన కుమార్తె మరణానికి కారణమయ్యారంటూ ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌కు స్పందించిన కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది.
షావర్మా అమ్మకాలపై కొత్త రూల్స్ విధించింది కేరళ సర్కార్. ఇకపై షావర్మా అమ్మాలంటే ఏ హోటల్, రెస్టారెంట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయినా సరే తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలి. లేకుంటే రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు.
కుడి మోకాలికి అయిన కారణంగా ఆసియా కప్‌కు దూరం కానున్నాడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. జడేజా స్థానంలో అక్సర్ పటేల్ జట్టుతో చేరనున్నాడు.
మహిళా ఎమ్మెల్యేపై దాడికి పాల్పడ్డాడు ఆమె భర్త. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పంజాబ్ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని బీజేపీ ఆలోచిస్తోంది. దీనిలో భాగంగా ఈనెల 17న తెలంగాణలో భారీ బహిరంగ సభకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరవుతారు.
ఏపీలోని విజయవాడలో వైసీసీ-జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. జెండా దిమ్మె విషయంలో రెండు పార్టీల నేతలు ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. నేతల్ని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్, జూబ్లీహిల్స్ రేప్ కేసుకు సంబంధించి నిందితుల విషయంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మైనర్లు అయిన నిందితులను మేజర్లుగా పరిగణించాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కేజీఎఫ్ సినిమాలో హీరోలాగా ఫేమస్ అవ్వాలనుకున్న ఒక యువకుడు ఐదుగురిని కిరాతకంగా హత్య చేశాడు. ఒంటరిగా ఉంటూ, రాత్రిపూట నిద్రపోయే సెక్యూరిటీ గార్డులను నిందితుడు హత్య చేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు.
విమాన సర్వీసు నిలిచిపోవడంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు నిరసనకు దిగారు. ఢిల్లీ నుంచి మ్యునిచ్ వెళ్లాల్సి ఉన్న విమానం.. పైలట్ల సమ్మె కారణంగా నిలిచిపోయింది. ప్రయాణికులకు సంస్థ ఎలాంటి వసతి ఏర్పాటు చేయలేదు. దీంతో వారంతా ఆందోళనకు దిగారు.
వరద నీటిలో చిక్కుకున్న ఒక గ్రామంలోని ప్రజలు... తమ ఊరికి చెందిన ఒక రోగిని ఆస్పత్రికి తరలించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. సొంతంగా బోటు తయారు చేసుకునిన, రోగిని పడుకోబెట్టి ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఈ నెల 6వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. అదే రోజు అసెంబ్లీ సెషన్స్ తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా పలు తీర్మానాలు చేసే అవకాశం ఉంది.
ఎన్డీయేలో చేరికపై పార్టీ కేడర్‌కు క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు
మహిళపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా హత్య కూడా చేశాడో నిందితుడు. అనంతరం అక్కడ్నుంచి పారిపోయాడు. కానీ, పోలీసులు అతడి మెడపై కొన్ని గాట్లు ఉండటం గుర్తించారు. దీంతో నిందితుడిని విచారించగా అసలు విషయం బయటపడింది.
రష్యన్ ముడి చమురు అయిన ఈఎస్‌పీఓ దిగుమతుల్ని భారీగా పెంచింది భారత్. రష్యా నుంచి గతంలో చైనా ఎక్కువగా ఈ రకం చమురును కొనేది. కానీ, ఇప్పుడు భారత్ ఈ చమురును అధికంగా కొంటోంది. ఈ విషయంలో చైనాను దాటిన భారత్ మొదటి స్థానంలో నిలిచింది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని వ్యతిరేకించిన రష్యాకు చెందిన రవిల్ అనే ప్రముఖ చమురు వ్యాపారి అనుమానాస్పదంగా మరణించాడు. రష్యా చమురు సంస్థలకు చెందిన కీలక వ్యక్తులు ఇటీవలి కాలంలో ఇలా అనుమానాస్పదంగా మరణిస్తున్నారు.