Russia: ఉక్రెయిన్ యుద్ధాన్ని వ్యతిరేకించిన రష్యన్ చమురు వ్యాపారి అనుమానాస్పద మృతి

ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని వ్యతిరేకించిన రష్యాకు చెందిన రవిల్ అనే ప్రముఖ చమురు వ్యాపారి అనుమానాస్పదంగా మరణించాడు. రష్యా చమురు సంస్థలకు చెందిన కీలక వ్యక్తులు ఇటీవలి కాలంలో ఇలా అనుమానాస్పదంగా మరణిస్తున్నారు.

Russia: ఉక్రెయిన్ యుద్ధాన్ని వ్యతిరేకించిన రష్యన్ చమురు వ్యాపారి అనుమానాస్పద మృతి

Updated On : September 1, 2022 / 8:41 PM IST

Russia: ఉక్రెయిన్‪‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని వ్యతిరేకించిన రష్యా చమురు వ్యాపారి అనుమానాస్పదంగా మృతి చెందాడు. రష్యాలోనే రెండో అతిపెద్ద చమురు సంస్థ అయిన ‘లుకాయిల్’ అధినేత రవిల్ మాగనోవ్. 67 ఏళ్ల ఈ వ్యాపారి గురువారం ఉదయం ఒక హాస్పిటల్ బిల్డింగ్ కిటికీ నుంచి కింద పడి మరణించాడు.

Surat: నోటి నుంచి మంట పుట్టించేందుకు ప్రయత్నం.. ఒళ్లంతా అంటుకున్న మంటలు.. వీడియో వైరల్

అయితే, ప్రమాదవశాత్తు పడ్డారా.. లేక ఆత్మహత్య చేసుకున్నారా అనే విషయంలో స్పష్టత లేదు. ఆయన మరణాన్ని లుకాయిల్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. రవిల్ మృతిపై తమ సంస్థ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. అయితే, ఆయన అనారోగ్యంతోనే మరణించినట్లు తెలిపింది. కానీ, సంస్థలోని కొందరు చెబుతున్న వివరాల ప్రకారం.. ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదని అక్కడి అధికారవర్గాలు తెలిపాయి. అయితే, ఆయన సన్నిహితులు మాత్రం రవిల్ ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదని చెబుతున్నారు.

WhatsApp: ఒక్క నెలలోనే 23 లక్షల అకౌంట్లు బ్లాక్ చేసిన వాట్సాప్.. ఎందుకో తెలుసా?

దీంతో ఇది హత్యా? ఆత్మహత్యా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా? అనే విషయంలో స్పష్టత లేదు. మరోవైపు ఇటీవలి కాలంలో రష్యాలో చమురు వ్యాపారం నిర్వహిస్తున్నవారితోపాటు, మరికొందరు అనుమానాస్పదంగా మరణిస్తున్నారు. లకాయిల్ సంస్థకు చెందిన మేనేజర్ అయిన అలెగ్జాండర్ కొద్దిరోజుల క్రితం తన ఇంటి బేస్‌మెంట్‌లో అనుమానాస్పదంగా మరణించాడు. మరికొందరు వ్యాపారులు, కీలక వ్యక్తులు కూడా ఇలాగే మరణిస్తుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది.