WhatsApp: ఒక్క నెలలోనే 23 లక్షల అకౌంట్లు బ్లాక్ చేసిన వాట్సాప్.. ఎందుకో తెలుసా?

23 లక్షల మంది యూజర్లకు షాకిచ్చింది వాట్సాప్. గత జూలైలో 23 లక్షల అకౌంట్లను బ్లాక్ చేసినట్లు తాజాగా వాట్సాప్ వెల్లడించింది. యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా ఉన్న అకౌంట్లను ఇలా బ్లాక్ చేస్తోంది.

WhatsApp: ఒక్క నెలలోనే 23 లక్షల అకౌంట్లు బ్లాక్ చేసిన వాట్సాప్.. ఎందుకో తెలుసా?

WhatsApp: వివిధ వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఒక్క నెలలోనే 2 మిలియన్లకు పైగా అకౌంట్లు బ్యాన్ చేసినట్లు వాట్సాప్ వెల్లడించింది. గత జూలైలో మొత్తం 23 లక్షల వాట్సాప్ అకౌంట్లను నిషేధించినట్లు తెలిపింది. ఇది అంతకుముందు నెలతో పోలిస్తే అధికం.

Surat: నోటి నుంచి మంట పుట్టించేందుకు ప్రయత్నం.. ఒళ్లంతా అంటుకున్న మంటలు.. వీడియో వైరల్

గత జూన్‌లో 22 లక్షల అకౌంట్లను బ్లాక్ చేసింది సంస్థ. యూజర్లకు నోటీసులు కూడా ఇవ్వకుండా వాట్సాప్ అకౌంట్లను బ్లాక్ చేస్తోంది. తప్పుడు సమాచారాన్ని అడ్డుకునేందుకు, సైబర్ ముప్పును నివారించేందుకు, ఎన్నికల సమగ్రత పరిరక్షణ వంటి అంశాల ఆధారంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వాట్సాప్ తెలిపింది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు నిపుణుల కమిటీ వాటిని పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంటుంది. కేంద్రం రూపొందించిన చట్టానికి అనుగుణంగా వాట్సాప్ నిబంధనలు పాటించని వాళ్ల అకౌంట్లను ఈ పద్ధతిలో నిషేధిస్తుంటారు. వాట్సాప్ వేదికగా వేధింపులు, హానికర ప్రవర్తనను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆ సంస్థ తెలిపింది.

Nirmala Sitharaman: ప్రాజెక్టుల వ్యయాన్ని ఇష్టం వచ్చినట్లుగా పెంచారు.. తెలంగాణ ప్రభుత్వంపై నిర్మలా సీతారామన్ ఫైర్

యూజర్లు ఎవరైనా ఇలాంటి అకౌంట్లపై ఫిర్యాదు చేయవచ్చు. మెయిల్ ద్వారా సంబంధిత అకౌంట్ల వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆ అకౌంట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లు కూడా తీసి ఫిర్యాదు చేస్తే, వాటిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నా, వేధింపులకు గురి చేస్తున్నా వాటిపై కూడా ఫిర్యాదు చేయవచ్చు. యూజర్లు ఈ అకౌంట్లను బ్లాక్ చేసి, రిపోర్ట్ చేయాలి. ఆ అకౌంట్లకు సంబంధించి చివరి 5 చాటింగ్‌లకు సంబంధించి మెసేజ్‌లను షేర్ చేయాలి.