Home » Author »Narender Thiru
పంజాబ్‌లో ఒక పాస్టర్ కారును కొందరు దుండగులు దహనం చేశారు. చర్చిలోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి తర్వాత జరిగింది.
తీవ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉండటంతోపాటు, అక్రమంగా నిర్మించిన మదర్సాలను అసోం సర్కారు కూల్చివేస్తోంది. దీనికి సంబంధించిన స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు మూడు మదర్సాలను కూల్చివేశారు.
రైల్వే కార్గోలో వచ్చిన పార్శిళ్లను జాగ్రత్తగా దింపాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పార్శిళ్లను దూరంగా విసిరేస్తున్నారు. దీనివల్ల చాలా వస్తువులు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది.
పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తే కొన్నిసార్లు టీచర్లు పిల్లల్ని కొడుతుంటారు. కానీ, ఝార్ఖండ్‌లో మాత్రం పిల్లలే టీచర్‌పై దాడి చేసి కొట్టారు. ఈ ఘటన గత సోమవారం జరిగింది. ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
గాలి నుంచే నీళ్లను ఉత్పత్తి చేయాలని ఎప్పట్నుంచో ప్రయోగాలు జరిగాయి. కొంతకాలం క్రితమే ఈ టెక్నాలజీ పూర్తిగా సక్సెస్ అయింది. త్వరలోనే ముంబైలో ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. గాలి నుంచే నీళ్లను ఉత్పత్తి చేయబోతున్నారు.
హైకోర్టు పరిధిలో శానిటరీ న్యాప్కిన్లు అందుబాటులో లేకపోవడంతో అసౌకర్యానికి గురైన ఒక యువ లాయర్.. ఈ విషయంపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది. కోర్టు పరిధిలో శానిటరీ న్యాప్కిన్లు ఏర్పాటు చేసేలా చూడాలని కోరింది.
యువకులు ఉద్యోగంలో చేరిన వెంటనే కనీసం నాలుగైదేళ్లపాటు రోజుకు 18 గంటలు పని చేయాలని సూచించాడు ఒక కంపెనీ సీఈవో. దీంతో అతడిపై ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. ఉద్యోగుల్ని ఇలాంటివాళ్లు బానిసలుగా చూస్తున్నారని విమర్శిస్తున్నారు.
అక్రమంగా విదేశీ కరెన్సీని దేశంలోకి తెచ్చేందుకు కొత్త దారి వెతుక్కున్నాడో వ్యక్తి. లెహెంగాలకు ఉండే బటన్స్‌ను అక్రమ నగదు రవాణాకు వాడుకున్నాడో వ్యక్తి. ఆ బటన్స్లోంచి భారీగా విదేశీ కరెన్సీ బయటపడింది.
ప్రపంచ పర్యాటక కేంద్రాల్లో ఒకటైన తాజ్ మహల్ తాజాగా వివాదంలో చిక్కుకుంది. శ్రీ కృష్ణుడి విగ్రహం కలిగి ఉన్నాడన్న కారణంగా ఒక పర్యాటకుడిని అనుమతించలేదు. దీనిపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
చిన్న ఆటోపైన స్కూలు విద్యార్థుల్ని కూర్చోబెట్టుకుని నిర్లక్ష్యంగా నడుపుతున్నాడో డ్రైవర్. పిల్లల్ని ఆటో పైన ఎక్కించుకోవడమే కాకుండా, వేగంగా, ప్రమాదకరంగా ఆటో నడిపిన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్‌కు కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు.
మూర్ఛ రావడంతో స్విమ్మింగ్ పూల్‌లో మునిగిపోతున్న తల్లిని కాపాడాడు ఆమె పదేళ్ల కొడుకు. పరుగెత్తుకుంటూ వెళ్లి తల్లిని మునిగిపోకుండా రక్షించాడు. బాలుడి సమయస్ఫూర్తి, సాహసాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
బెంగళూరు మహానగరంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది.
అవినీతి వ్యతిరేక ఉద్యమంలోంచి పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త మద్యం పాలసీ తీసుకొస్తుందని తాను ఊహించలేదన్నారు ఉద్యమకర్త అన్నా హజారే. కొత్త మద్యం పాలసీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను విమర్శిస్తూ అన్నా హజారే రెండు పేజీల లేఖ రాశారు.
ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయడమే టీఆరెస్, బీజేపీ ఎజెండాగా పెట్టుకున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. రెండూ పార్టీలూ.. నాయకుల కొనుగోళ్ల కోసం కమిటీలు ఏర్పాటు చేశాయని చెప్పారు. మునుగోడులో నాయకుల కొనుగోళ్లకు టీఆర్ఎస్ తెరలేపిందన్నారు.
సరిహద్దులో నెలకొన్న పరిస్థితి ఆధారంగానే భారత్-చైనా మధ్య సంబంధాలు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాల గురించి అందరికీ తెలిసిందే అన్నారు.
భారత్ నుంచి ఆహార ఉత్పత్తులు దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలిస్తామని పాక్ చేసిన ప్రకటనపై భారత్ స్పందించింది. సరిహద్దు తీవ్రవాదాన్ని ఆపితేనే, ఆ దేశంతో వాణిజ్య సంబంధాల్ని పునరుద్ధరిస్తామని చెప్పింది.
హిందువైన ఒక వ్యక్తికి బలవంతంగా బీఫ్ తినిపించారు అతడి భార్య, బావమరిది. దీంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలను అతడు, అంతకుముందు తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను సీఎం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. పోలీసులు లేకుండా కేసీఆర్ పాదయాత్ర చేయాలని సూచించారు. అలా చేస్తే తాను పాదయాత్ర మానేస్తానని అన్నారు.
బెంగళూరు మహానగరం పరిధిలో వినాయక చవితి సందర్భంగా మాంసం విక్రయాలు నిలిపివేస్తూ అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 31న ఎలాంటి మాంసం విక్రయించరాదని ఆదేశించింది. దీనిపై అసదుద్దీన్ మండిపడుతున్నారు.