Home » Author »Narender Thiru
తన కుటుంబ సభ్యులు దుబాయ్ వెళ్లకుండా ఆపేందుకు, వాళ్లు ప్రయాణించే విమానంలో బాంబు ఉందని బెదిరించాడో వ్యక్తి. దీంతో విమానం నిలిచిపోయింది. పూర్తిగా విమానంలో తనిఖీలు చేసిన పోలీసులు ఏ బాంబూ లేదని తేల్చారు. తర్వాత ఫేక్ కాల్ చేసిన నిందితుడిని పట్టు�
తెలంగాణ నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న 181 పోస్టుల్ని భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ధైర్యముంటే కేసీఆర్ ఈ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. హన్మకొండలో జరిగిన సభలో బండి సంజయ్ మాట్లాడా
ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఈ విషయాన్ని ఆజాద్‌కు అత్యంత సన్నిహితుడైన సరూరి వెల్లడించారు. రెండు వారాల్లో ఆజాద్ కొత్త పార్టీ పెడతారని చెప్పాడు.
పర్యావరణంపై ఏపీ ప్రభుత్వాన్ని ఉన్నట్టుండి ప్రేమెందుకు పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. విశాఖ పట్నం పరిశ్రమలు, గ్యాస్ లీక్ వ్యవహారంలో ఇంకా నిందితులపై చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్‌ను త్వరలోనే ఇంటికి సాగనంపుతారని, ప్రజలు బీజేపీకే మద్దతు ఇస్తారని వ్యాఖ్యానించారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీ అత్యవసరంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆదివారం మధ్యాహ్నం ఈ మీటింగ్ జరుగుతుంది. కొత్త అధ్యక్షుడి ఎన్నికపై ఈ సమావేశంలో చర్చిస్తారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను నిర్ణయిస్తారు.
ఝార్ఖండ్‌లో రిసార్డు రాజకీయం మొదలైంది. తనపై గవర్నర్ అనర్హత వేటు వేస్తే, తన పార్టీ అధికారం కోల్పోయే అవకాశం ఉందని భావిస్తున్నారు సీఎం శిబూసోరెన్. అందుకే తన కూటమి ఎమ్మెల్యేలు చేజారకుండా వారిని రహస్య ప్రదేశానికి తరలించాడు.
నీట్ పరీక్ష సందర్భంగా కేరళలోని కొందరు విద్యార్థినిలకు నిర్వాహకులు లో దుస్తులు తీయించిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థులు లో దుస్తులు తీసేసి, పరీక్ష రాశారు. అయితే, దీనివల్ల మానసిక ఒత్తిడికి గురైన వాళ్లు పరీక్ష సరిగ్గా రాయలేకపోయారు. దీంతో �
20 మందికిపైగా రైతులతో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బ్రిడ్జిపై నుంచి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 13 మంది ఈదుకుంటూ, ఒడ్డుకు చేరి ప్రాణాలతో బయటపడ్డారు. మరో పది మంది వరకు గల్లంతయ్యారు.
దేశంలో సొంతంగా తయారు చేసిన వందే భారత్ మూడో రైలు ట్రయల్ రన్ ముగిసింది. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నట్లు రైల్వే మంత్రి వెల్లడించారు. వచ్చే ఆగష్టు నాటికి ఇలాంటి మొత్తం 75 రైళ్లను అందుబాటులోకి తేవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుం�
అక్రమాలకు పాల్పడ్డ అధికారుల ఇండ్ల నుంచి బిహార్ విజిలెన్స్ అధికారులు రూ.4 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (వీఐబీ) అధికారులు శనివారం ఈ దాడులు నిర్వహించారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.
కోవిడ్ వ్యాక్సిన్ల తయారీలో తమ సంస్థ పేటెంట్ కలిగి ఉన్న సాంకేతికను వాడుకున్నాయని ఆరోపిస్తూ ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలపై అమెరికాకు చెందిన మోడెర్నా అనే సంస్థ దావా వేసింది. ఈ సంస్థ అమెరికాలో వ్యాక్సిన్ తయారీలో అగ్రగామిగా కొనసాగుతోంది.
పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు కూడా డోప్ టెస్టులు నిర్వహిస్తోంది డీజీసీఏ. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఒక పైలట్ డ్రగ్స్ టెస్టులో దొరికిపోయాడు. దీంతో అతడ్ని విధుల్లోంచి తొలగించినట్లు ప్రకటించింది. మరో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌ను క�
మొసళ్ల మధ్య, నదిలో చిక్కుకున్నాడో బాలుడు. ప్రాణభయంతో ఈదుతూనే సహాయం కోసం అరుస్తున్నాడు. వెంటనే అతడ్ని గమనించిందో బృందం. పడవలో వెళ్తున్న ఆ బృంద సభ్యులు వేగంగా స్పందించి, బాలుడ్ని రక్షించారు.
తెలంగాణలోని విద్యా సంస్థల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహంచిన ఐసెట్-2022 ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం మూడు గంటలకు ఫలితాలు విడుదల అవుతాయి.
ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో అధికారాన్ని కోల్పోయిన శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే తిరిగి పార్టీని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరాఠా సంస్థ అయిన శంభాజీ బ్రిగేడ్‌తో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు.
పాక్ భూ భాగంపై భారతీయ సింగర్ సిద్ధూ మూసేవాలా పాట ప్లే అయింది. అది కూడా భారత్-పాక్ సరిహద్దులో. దీంతో దగ్గర్లో ఉన్న భారత సైనికులు ఆనందంతో డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దేశంలోని ఫేక్ యూనివర్సిటీల లిస్టు విడుదల చేసింది యూజీసీ. ఇందులో ఏపీకి చెందిన ఒక యూనివర్సిటీ కూడా ఉంది. ఈ యూనివర్సిటీలు జారీ చేసే సర్టిఫికెట్లు చెల్లవని యూజీసీ పేర్కొంది.
నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత కార్యక్రమం ఆదివారం జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కూల్చివేత సందర్భంగా అధికారులు ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. ట్విన్ టవర్స్ ఆనుకుని ఉన్న నోయిడా ఎక్స్‌ప్రెస్ వేను కూడా �