Viral video: మొసళ్ల మధ్య నదిలో పడిపోయిన బాలుడు.. ప్రాణభయంతో అరుపులు.. తర్వాత ఏం జరిగిందంటే..

మొసళ్ల మధ్య, నదిలో చిక్కుకున్నాడో బాలుడు. ప్రాణభయంతో ఈదుతూనే సహాయం కోసం అరుస్తున్నాడు. వెంటనే అతడ్ని గమనించిందో బృందం. పడవలో వెళ్తున్న ఆ బృంద సభ్యులు వేగంగా స్పందించి, బాలుడ్ని రక్షించారు.

Viral video: మొసళ్ల మధ్య నదిలో పడిపోయిన బాలుడు.. ప్రాణభయంతో అరుపులు.. తర్వాత ఏం జరిగిందంటే..

Updated On : August 26, 2022 / 8:59 PM IST

Viral video: ప్రమాదవశాత్తు మొసళ్లు ఎక్కువగా ఉండే చంబల్ నదిలో పడిపోయాడో బాలుడు. అతడ్ని మొసళ్లు చుట్టుముట్టాయి. వెంటనే ప్రాణభయంతో అరుస్తూ, వాటి నుంచి దూరంగా వెళ్లేందుకు వేగంగా ఈదుతున్నాడు. అప్పుడే అతడ్ని గమనించి, రక్షించిందో బృందం.

Uddhav Thackeray: మరాఠా సంస్థ శంభాజీ బ్రిగేడ్‌తో శివసేన పొత్తు.. ప్రకటించిన ఉద్ధవ్ థాక్రే

ఈ ఘటన ఇటీవల జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను భగీరథ్ చౌదరి అనే ఐఆర్ఎస్ అధికారి షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. ఒక బాలుడు చంబల్ నదిలో మొసళ్ల మధ్య చిక్కుకున్నాడు. అతడ్ని మొసళ్లు చుట్టుముట్టాయి. బాలుడు నది మధ్యలో ఉండటంతో వాటి నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు. అయినా సరే.. వాటి నుంచి తప్పించుకునేందుకు ఒకవైపు ప్రాణభయంతో సహాయం కోసం అరుస్తూ, మరోవైపు వేగంగా ఈదుతున్నాడు. మొసళ్లు ఒకదాని వెంట ఒకటి బాలుడి వెనకే వస్తున్నాయి. అయితే, అక్కడే పడవలో ఉన్న ఒక బృందం బాలుడ్ని గమనించింది. వెంటనే బాలుడి వద్దకు చేరుకుని క్షణాల్లో బాలుడ్ని పడవలోకి ఎక్కించుకున్నారు.

Indian soldiers dance: సిద్ధూ మూసేవాలా పాట ప్లే చేసిన పాక్ ఆర్మీ.. సరిహద్దులో భారత సైనికుడి డ్యాన్స్.. వీడియో వైరల్

ఆ సమయంలో ఆ బృందం అక్కడ లేకపోయినా, సమయానికి రక్షించకపోయినా బాలుడు మొసళ్లకు బలయ్యేవాడే. క్షణాల్లో స్పందించి బాలుడిని రక్షించిన ఆ బృందాన్ని భగీరథ్‌తోపాటు, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కావాలంటే ఆ వీడియో మీరు చూడండి.