Uddhav Thackeray: మరాఠా సంస్థ శంభాజీ బ్రిగేడ్‌తో శివసేన పొత్తు.. ప్రకటించిన ఉద్ధవ్ థాక్రే

ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో అధికారాన్ని కోల్పోయిన శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే తిరిగి పార్టీని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరాఠా సంస్థ అయిన శంభాజీ బ్రిగేడ్‌తో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు.

Uddhav Thackeray: మరాఠా సంస్థ శంభాజీ బ్రిగేడ్‌తో శివసేన పొత్తు.. ప్రకటించిన ఉద్ధవ్ థాక్రే

Uddhav Thackeray: మరాఠా సంస్థ శంభాజీ బ్రిగేడ్‌తో పొత్తు పెట్టుకుంటున్నట్లు శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. రాజ్యాంగాన్ని, ప్రాంతీయతను కాపాడేందుకు ఈ పొత్తు పెట్టుకుంటున్నట్లు ఉద్ధవ్ తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు చేశారు.

Pizza Delivery Boy: చిరిగిన నోటు తీసుకోలేదని పిజ్జా డెలివరీ బాయ్‌పై కాల్పులు.. పరిస్థితి విషమం

‘‘ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు బీజేపీ కట్టుబడి పనిచేస్తుందో లేదో.. ఆ పార్టీనే అడగాలి. కనీసం మోహన్ భగవత్ సిద్ధాంతాలకు అనుగుణంగానైనా బీజేపీ పనిచేస్తోందా? బీజేపీతో అధికారం కోసం పొత్తు పెట్టుకుంది హిందూత్వ అజెండా కోసమే. అయితే, ఆ పార్టీ క్రమంగా హిందూత్వ అజెండా నుంచి పక్కకు తప్పుకొంది. అందుకే రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, హిందూత్వ సిద్దాంతాలకు కట్టుబడిన మరో సంస్థతో పొత్తు పెట్టుకుంటున్నాం. ఒక్క పార్టీ కంటే ఎక్కువ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఎలాంటి నష్టం కలగలేదు కదా’’ అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా దాదాపు 30 పార్టీలతో పొత్తు పెట్టుకున్నట్లు ఉద్ధవ్ గుర్తు చేశారు. శంభాజీ బ్రిగేడ్.. సిద్ధాంతాలకు కట్టుబడిన పార్టీ అని ప్రశంసించారు.

Indian soldiers dance: సిద్ధూ మూసేవాలా పాట ప్లే చేసిన పాక్ ఆర్మీ.. సరిహద్దులో భారత సైనికుడి డ్యాన్స్.. వీడియో వైరల్

అనంతరం శంభాజీ బ్రిగేడ్ అధినేత మనోజ్ అఖారే మాట్లాడారు. ‘‘మా సంస్థ 2016లో రాజకీయ పార్టీగా మారింది. శివసేన, శంభాజి బ్రిగేడ్ కలిసి పనిచేయాలని నిర్ణయించాం. ఎలాంటి అరమరికలు లేకుండా పనిచేసేందుకు వీలుగా సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాం’’ అని మనోజ్ తెలిపారు. బీజేపీ, షిండే వల్ల అధికారం కోల్పోయిన ఉద్ధవ్ తిరిగి పార్టీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే శంభాజీ బ్రిగేడ్‌తో పొత్తు పెట్టుకున్నారు. ప్రస్తుతం పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టిపెట్టిన ఉద్ధవ్, దసరా తర్వాత రాష్ట్రమంతా పర్యటించబోతున్నారు.