Home » Author »Narender Thiru
బీజేపీ నిర్వహించతలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో శనివారం ఈ సభ జరుగుతుంది. దీనికి పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా కూడా హాజరుకాబోతున్నారు.
ఈ వీడియో చూస్తే ఒళ్లు జలధరించడం ఖాయం. ఎందుకంటే ప్రమాదకరంగా ఉన్న స్లైడ్ పై నుంచి కొందరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే జారుతున్నారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 11 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. కావాలంటే మీరూ చూడండి.
చిరిగిన నోటు స్థానంలో మంచి నోటు ఇవ్వమని అడిగినందుకు పిజ్జా డెలివరీ బాయ్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధితుడి స్నేహితుడు అతడ్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ త్వరలో విమానయాన సేవల్ని ప్రారంభించనుంది. 2019లో నిలిచిపోయిన సేవల్ని ఈ ఏడాది చివరికల్లా ప్రారంభిస్తామని కంపెనీ వెల్లడించింది. గతంలో పనిచేసిన సిబ్బందినే ఈసారి కూడా ఎక్కువగా తీసుకున్నట్లు చెప్పింది.
టెన్నిస్ దిగ్గజ ఆటగాడు, సెర్బియాకు చెందిన నోవాక్ జకోవిచ్ యూఎస్ ఓపెన్‌లో పాల్గొనడం లేదని ప్రకటించాడు. కోవిడ్ వ్యాక్సినేషన్ నిబంధనల ప్రకారం అమెరికాలో జరిగే ఈ టోర్నమెంట్లో పాల్గొనడం లేదని చెప్పాడు.
వచ్చే వారం ఢిల్లీలో జరగబోయే మునావర్ ఫారుఖి స్టాండప్ కామెడీ షోను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ పోలీసులకు వీహెచ్‌పీ లేఖ రాసింది. షోను రద్దు చేయకుంటే అడ్డుకుని తీరుతామని హెచ్చరించింది. ఆందోళన చేపడతామని కూడా తెలిపింది.
తానొక లాయర్ని అని, అవసరమైనప్పుడు న్యాయవాదిగా హైకోర్టుకు వచ్చి కేసులు వాదించగలనని చెప్పారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. తనకు బార్ కౌన్సిల్లో కూడా సభ్యత్వం కూడా ఉన్నట్లు వెల్లడించారు. కోల్‌కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
రచయిత సల్మాన్ రష్దీపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ అంశంపై భారత్ స్పందించడం ఇదే తొలిసారి.
రెండు రోజుల క్రితం గోవాలో మరణించిన బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్ పోస్టుమార్టమ్ నివేదిక కలకలం రేపుతోంది. పోలీసులు ఆమె గుండెపోటుతో మరణించిందని చెప్పినప్పటికీ, తాజా నివేదికలో ఆమె ఒంటిపై గాయాలున్నట్లు తేలింది. దీంతో హత్య కోణంలో పోలీసులు దర్యాప�
2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రెండు రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షుల్ని నియమించింది. ఉత్తర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా భూపేంద్ర సింగ్ చౌదురిని, త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా రాజీవ్ భట్టాచార్యను బీజేపీ నియమించింది.
గత నెలలో జరిగిన టీఎస్ఎస్పీడీసీఎల్ లైన్మెన్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ పరీక్ష సందర్భంగా 181 మంది మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త పరీక్షా తేదీని త్వరలోనే ప్
కేంద్ర ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క మంచి పని చేసిందా? దేశానికి ఎందుకు మంచినీళ్లు ఇవ్వలేకపోతున్నారు? అంటూ కేంద్రంలోని బీజేపీపై విమర్శలు గుప్పించారు సీఎం కేసీఆర్. గురువారం రంగారెడ్డి జిల్లాలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. ఎలాంటి షరతులు లేకుండానే యాత్ర కొనసాగించేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. స్టేషన్ ఘన్పూర్ నుంచే ఈ యాత్ర ప్రారంభమవ్వబోతుంది.
తన పార్టీకి 40 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ రూ.800 కోట్లు కేటాయించిందని ఆరోపించారు అరవింద్ కేజ్రీవాల్. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్, పాతబస్తీ ప్రాంతంలో తలెత్తిన ఘర్షణలకు బీజేపీనే కారణమని భావిస్తూ ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు ఎంపీ, ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఈ మేరకు గురువారం తెలుగులో ట్వీట్లు చేసి, బీజేపీ తీరును తప్పుబట్టారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తీవ్ర ఉద్రిక్తత మధ్య గురువారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇంటిలోకి చొరబడ్డ పోలీసులు బలవంతంగా ఆయనను తీసుకెళ్లారు.
ఆసియా కప్‌కు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌ను ఎంపిక చేసింది బీసీసీఐ. ప్రస్తుతం ప్రధాన కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్ ఇటీవల కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో లక్ష్మణ్‌ను ఆయన స్థానంలో మధ్యంతర కోచ్‌గా ఎంపిక చేసింది.
మెక్ డొనాల్డ్స్ ఔట్‌లెట్‌లోకి చొరబడ్డ కొందరు యూత్.. స్టాఫ్‌ను బెదిరించి, తమ చేతికి దొరికిన ఫుడ్, డ్రింక్స్ ఎత్తుకెళ్లారు. ఈ ఘటనను వారిలో కొందరు వీడియో కూడా తీశారు. దీనిపై నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాతబస్తీని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు.. చుట్టుపక్కల షాపుల్ని మూసివేయించారు. అందరినీ రాత్రి ఎనిమిది గంటలలోపే ఇండ్లకు వెళ్లాలని ఆదేశించారు.
వచ్చే నెలలో జపాన్‌లో జరగనున్న ఆ దేశ మాజీ ప్రధాని షింజో అబే అధికారిక వీడ్కోలు కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవ్వనున్నారు. సెప్టెంబర్ 27న ఈ కార్యక్రమం రాజధాని టోక్యోలో జరుగుతుంది.