VVS Laxman: రాహుల్ ద్రావిడ్‌కు కోవిడ్.. ఆసియా కప్‌కు భారత కోచ్‌గా లక్ష్మణ్
ఆసియా కప్‌కు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌ను ఎంపిక చేసింది బీసీసీఐ. ప్రస్తుతం ప్రధాన కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్ ఇటీవల కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో లక్ష్మణ్‌ను ఆయన స్థానంలో మధ్యంతర కోచ్‌గా ఎంపిక చేసింది.

VVS Laxman: ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ కోసం భారత మాజీ స్టార్ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. ప్రధాన కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్ ఇటీవల కోవిడ్ బారిన పడిన నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్ పూర్తయ్యే వరకు హెడ్ కోచ్‌గా లక్ష్మణ్ వ్యవహరిస్తారని బీసీసీఐ ప్రకటించింది.
Kapil Dev: ఆ మ్యాచ్ గురించి గుర్తొస్తే.. ఇప్పటికీ నిద్ర పట్టదు: కపిల్ దేవ్
రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం కోవిడ్ చికిత్స పొందుతున్నారని, ఆయన కోలుకున్న తర్వాత తిరిగి జట్టుతో చేరుతారని బీసీసీఐ పేర్కొంది. ప్రస్తుతం లక్ష్మణ్ జాతీయ క్రికెట్ అకాడమీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌కు కూడా ఆయన కోచ్‌గా వ్యవహరించారు. ఈ సిరీస్‌లో ఇండియా ఘన విజయం సాధించి క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. యూఏఈలో ఈ నెల 27 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ కెప్టెన్‌గా, కే.ఎల్.రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ టోర్నమెంట్‌కు మొత్తం 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ఎంపిక చేసింది.
ఈ జట్టులో విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, దీపక్ చాహర్, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లున్నారు. అయితే, గాయాల కారణంగా కీలక బౌలర్లైన జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ ఈ టోర్నమెంట్‌కు దూరమయ్యారు.