McDonalds outlet: మెక్ డొనాల్డ్స్ స్టాఫ్‌ను బెదిరించి.. డ్రింక్స్, ఫుడ్ ఎత్తుకెళ్లిన యూత్.. వీడియో వైరల్

మెక్ డొనాల్డ్స్ ఔట్‌లెట్‌లోకి చొరబడ్డ కొందరు యూత్.. స్టాఫ్‌ను బెదిరించి, తమ చేతికి దొరికిన ఫుడ్, డ్రింక్స్ ఎత్తుకెళ్లారు. ఈ ఘటనను వారిలో కొందరు వీడియో కూడా తీశారు. దీనిపై నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

McDonalds outlet: మెక్ డొనాల్డ్స్ స్టాఫ్‌ను బెదిరించి.. డ్రింక్స్, ఫుడ్ ఎత్తుకెళ్లిన యూత్.. వీడియో వైరల్

McDonalds outlet: మెక్ డొనాల్డ్స్ అంటే యూత్‌కు అదో రకమైన క్రేజ్. ఇక్కడ దొరికే బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, డ్రింక్స్ వంటివాటిని యూత్ ఇష్టంగా తీసుకుంటారు. అయితే, ఇక్కడి ఫుడ్ కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది. అందుకేనేమో.. బ్రిటన్‌లో కొందరు టీనేజర్లు మెక్ డొనాల్డ్స్ ఔట్‌లెట్‌లోకి చొరబడి దొరికిన ఫుడ్, డ్రింక్స్ ఎత్తుకెళ్లారు.

Hyderabad: భద్రతా వలయంలో పాతబస్తి.. ముందుజాగ్రత్త చర్యగా షాపుల మూసివేత.. ట్రాఫిక్ మళ్లింపు

అదీ… ఒక్కరో, ఇద్దరో కాదు. ఏకంగా యాభై మందికిపైగా యూత్ ఈ పని చేశారు. వీరంతా 14-16 ఏళ్ల వయసున్న టీనేజర్లే కావడం విశేషం. ఇంగ్లండ్, నాటింగ్‌హామ్‌లోని క్లంబర్ స్ట్రీట్‌లో ఉన్న ఒక మెక్ డొనాల్డ్స్ ఔట్‌లెట్‌లోకి గత ఆదివారం ఉదయం 20 మంది వరకు టీనేజర్లు చొరబడ్డారు. అక్కడి స్టాఫ్‌ను బెదిరించి కావాల్సిన ఫుడ్, డ్రింక్స్ తీసుకున్నారు. ఆ వెంటనే ఇంకొందరు టీనేజర్లు లోపలికి చొచ్చుకొచ్చి వాళ్లు కూడా దొరికిన డ్రింక్స్, ఫుడ్ తీసుకెళ్లారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్టాఫ్‌ను బెదిరించారు. వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఒకేసారి 50 మందికిపైగా లోపలికి చొచ్చుకురావడంతో మెక్ డొనాల్డ్స్ ఔట్‌లెట్‌ నిర్వాహకులకు ఏం చేయాలో తెలియలేదు. జరుగుతున్నదంతా చూస్తూ.. నిస్సహాయంగా నిలబడిపోయారు.

Kapil Dev: ఆ మ్యాచ్ గురించి గుర్తొస్తే.. ఇప్పటికీ నిద్ర పట్టదు: కపిల్ దేవ్

ఆ టీనేజర్లంతా తమకు నచ్చినవి తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనను వారిలో కొందరు వీడియో కూడా తీసుకున్నారు. ఈ ఘటనతో భయానికి గురైన స్టాఫ్ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఇప్పటివరకు ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోలేదు. దీనిపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.