Hyderabad: భద్రతా వలయంలో పాతబస్తి.. ముందుజాగ్రత్త చర్యగా షాపుల మూసివేత.. ట్రాఫిక్ మళ్లింపు

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాతబస్తీని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు.. చుట్టుపక్కల షాపుల్ని మూసివేయించారు. అందరినీ రాత్రి ఎనిమిది గంటలలోపే ఇండ్లకు వెళ్లాలని ఆదేశించారు.

Hyderabad: భద్రతా వలయంలో పాతబస్తి.. ముందుజాగ్రత్త చర్యగా షాపుల మూసివేత.. ట్రాఫిక్ మళ్లింపు

Hyderabad: తాజా ఘర్షణల నేపథ్యంలో హైదరాబాద్, పాతబస్తీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతం మొత్తాన్ని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా ఒక వర్గం ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

Nitish Kumar: విశ్వాస పరీక్షలో నెగ్గిన నితీష్ కుమార్.. బీజేపీపై విమర్శలు

దాదాపు రెండు రోజుల నుంచి పాతబస్తి, పరిసర ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. దీంతో కొందరు ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చార్‌మినార్, మదీనాగూడ, చాంద్రాయణ గుట్ట, బార్కాస్, సిటీ కాలేజ్‌తోపాటు అనేక ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా రాత్రి ఏడు గంటలలోపే పాతబస్తి చుట్టుపక్కల షాపులను పోలీసులు మూసేయించారు. అందరూ రాత్రి ఎనిమిది గంటలకల్లా ఇండ్లకు వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశించారు. దీనిపై మైకుల్లో ప్రచారం చేశారు. తమ సూచనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో పాతబస్తి మెల్లిగా నిర్మానుష్యంగా మారుతోంది. అయితే, పోలీసుల ఆంక్షలతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

Kapil Dev: ఆ మ్యాచ్ గురించి గుర్తొస్తే.. ఇప్పటికీ నిద్ర పట్టదు: కపిల్ దేవ్

మరోవైపు సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దంటూ సూచించారు. ఎటువంటి ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదన్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరికొన్ని చోట్ల ట్రాఫిక్ దారి మళ్లించారు. పురానాపూల్ బ్రిడ్జ్, ఎంజే బ్రిడ్జ్ నుంచి ఓల్డ్ సిటీ, మలక్ పేట్, ఎల్బీ నగర్ వైపు వాహనాలను అనుమతించడం లేదు. నయాపూల్ బ్రిడ్జ్, శివాజీ బ్రిడ్జ్, చాదర్‌ఘాట్ బ్రిడ్జ్, కాజ్ వే, మూసారాం బాగ్ నుంచి వెళ్లే వాహనాలను ఇతర మార్గాల్లో మళ్లిస్తున్నారు.