Home » Author »Narender Thiru
తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే బుధవారం బిహార్ వెళ్లనున్నారు. అక్కడ సీఎం నితీష్ కుమార్‌తో భేటీ అవుతారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే అమరులైన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తారు.
2020లో ఢిల్లీ అల్లర్లలో పాల్గొన్న ఒక విద్యార్థినికి యూనివర్సిటీ అధికారులు అడ్మిషన్ నిరాకరించారు. సఫూరా జార్గర్ అనే విద్యార్థినికి వివిధ సాంకేతిక కారణాలతో అడ్మిషన్ నిరాకరించారు. ఈ నిర్ణయంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది.
బీజేపీ ముక్త భారత్ కోసం అందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. పెద్దపల్లి జిల్లాలో సోమవారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు.
ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా జలపాతం వద్దకు విహారయాత్రకు వెళ్లిన పర్యాటకులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. జలపాతం వద్ద స్నానం చేస్తుండగా, ఆరుగురు నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఛత్తీస్‌ఘడ్‌లో జరిగింది.
మణప్పురం ఫైనాన్స్‌లో భారీ దోపిడీ జరిగింది. సినిమాలోని సన్నివేశాల్ని తలదన్నేలా.. ముసుగులు ధరించిన ఐదుగురు దుండగులు సిబ్బందిని తుపాకీతో బెదిరించారు. ఆఫీస్‌లో ఉన్న రూ.12 కోట్ల విలువైన నగల్ని ఎత్తుకెళ్లారు.
బస్సు ఫుట్‌బోర్డ్‌పై నిలబడ్డ విద్యార్థి అదుపుతప్పి రోడ్డుపై పడ్డాడు. ఈ ఘటనలో ఆ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే డ్రైవర్ ఆస్పత్రికి తరలించాడు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థి మరణించాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
పుషప్స్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పాలంటే నెలల తరబడి జిమ్‌లో కసరత్తులు, నిపుణుల ఆధ్వర్యంలో శిక్షణ, డైట్ వంటివి అవసరం. కానీ, ఇవేవీ లేకుండానే ఒక యువకుడు పుషప్స్‌లో ప్రపంచ రికార్డు సృష్టించాడు.
పెరట్లో... చెట్టు కింద, మంచంపై పడుకుని ఉందో మహిళ. ఎక్కడ్నుంచో వచ్చిన నాగుపాము ఆమె ఒంటిపైకి ఎక్కింది. పడగవిప్పి అలాగే ఉంది. దీంతో ఆ మహిళ భయంతో, ప్రాణాలు అరచేత పట్టుకుని అలాగే ఉండిపోయింది.
ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం సాయంత్రం జరిగిన ఇండియా-పాక్ మ్యాచ్‌కు హాజరయ్యాడు యువ హీరో విజయ్ దేవరకొండ. ప్రేక్షకులతో కలిసి నేరుగా మ్యాచ్ చూసేందుకు విజయ్ దుబాయ్ వెళ్లాడు. అక్కడ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌తో కలిసి మ్యాచ్ చూశాడు.
దేశంలో మొదటిసారిగా ఎంబీబీఎస్ కోర్సును హిందీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది మధ్య ప్రదేశ్ ప్రభుత్వం. ఈ ఏడాది నుంచే ప్రయోగాత్మకంగా ఈ కోర్సును ప్రభుత్వం హిందీలో నిర్వహించబోతుంది. అయితే, దీనిపై వైద్య రంగ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నార
దేశంలో కరోనా కేసులు తగ్గుతుంటే స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. రెండింటిలోనూ కొన్ని లక్షణాలు ఒకేలా ఉండటంతో చాలా మంది స్వైన్ ఫ్లూ సోకినా.. కోవిడ్ పరీక్షలు మాత్రమే చేసుకుంటున్నారు. దీంతో ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది.
రెండు రోజులపాటు రైతు సంఘాల నేతలతో సమావేశమైన సీఎం కేసీఆర్ భేటీ ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా రైతు సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన ఉద్యమం గురించి చర్చించారు. శాంతియుత మార్గంలో ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు.
తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాల అర్హత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 35 పట్టణాల్లోని, 1,601 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. 6,03,955 మంది అభ్యర్థులు హాజరయ్యారు. త్వరలోనే ప్రిలిమినరీ ‘కీ’ని విడుదల చేస్తామని అధికారులు ప్రకటిం�
ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం సాయంత్రం ఇండియాతో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు తమ చేతికి నల్లటి బ్యాండ్ ధరించారు. దీనికి కారణం ఉంది. పాకిస్తాన్‌ను ఇటీవల భారీ వరదలు ముంచెత్తాయి. ఈ వరదల్లో వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.
ప్రపంచ కుబేరుడైన ఎలన్ మస్క్ తల్లి ఒక గ్యారేజ్‌లో నిద్ర పోయారట. తన కొడుకును కలిసేందుకు టెక్సాస్ వెళ్లిన తర్వాత, అక్కడ విలాసవంతమైన ఇండ్లు లేవని, దీంతో ‘స్పేస్ ఎక్స్’ కార్యాలయంలోని గ్యారేజ్‌లో నిద్ర పోయినట్లు ఎలన్ మస్క్ తల్లి మయే మస్క్ తెలిపా�
తోటి విద్యార్థితో గొడవ పడుతున్న ఒక విద్యార్థిని టీచర్ కర్రతో కొట్టాడు. తీవ్రంగా కొట్టడంతో విద్యార్థి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి మోచేయి విరిగింది. దీంతో బాధ్యుడైన ఉపాధ్యాయుడిపై విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వరల్డ్ ఫేమస్ డీజేలలో ఒకడైన అలాన్ వాకర్ త్వరలో హైదరాబాద్ రానున్నాడు. వచ్చే నెలలో శంషాబాద్‌లో జరిగే ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తాడు. దీనికి సంబంధించిన టిక్కెట్ల విక్రయం ప్రారంభమైంది.
న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు, న్యాయమూర్తులుగా రిటైరైన వారికి తర్వాత.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సేవలు లభిస్తాయో తెలుసా? దీనికి సంబంధించి కేంద్ర న్యాయశాఖ తాజాగా ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోట�
వచ్చె సెప్టెంబర్ నెలను ‘పోషకాహార మాసం’గా జరుపుకోవాలని సూచించారు ప్రధాని మోదీ. దేశంలో పోషకాహార లోపాన్ని పారద్రోలేందుకు ప్రజలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘మన కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మోదీ మాట్లాడారు.
ఒక ఊరిలో కలుషిత నీళ్లు తాగిన పన్నెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అదే గ్రామానికి చెందిన మరో 50 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. వీరికి ప్రస్తుతం అధికారులు చికిత్స అందిస్తున్నారు.