Viral video: పెరట్లో మంచంపై పడుకున్న మహిళ.. ఆమె మీదికెక్కిన నాగుపాము.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
పెరట్లో... చెట్టు కింద, మంచంపై పడుకుని ఉందో మహిళ. ఎక్కడ్నుంచో వచ్చిన నాగుపాము ఆమె ఒంటిపైకి ఎక్కింది. పడగవిప్పి అలాగే ఉంది. దీంతో ఆ మహిళ భయంతో, ప్రాణాలు అరచేత పట్టుకుని అలాగే ఉండిపోయింది.
Viral video: నాగుపామును చూస్తేనే గజగజ వణికిపోతారు చాలామంది. అలాంటిది ఆ పాము నేరుగా ఒంటి మీదికి ఎక్కితే! వామ్మో! ఊహించుకోవడమే కష్టంగా ఉంది కదూ. కానీ, నిజంగానే ఒక మహిళపైకి ఎక్కిందో నాగుపాము. సుశాంతా నందా అనే ఒక ఐఎఫ్ఎస్ అధికారి ఒక వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడుదల చేశారు.
ఆ వీడియో చూస్తే భయంతో ఒళ్లు జలధరించడం ఖాయం. ఆ వీడియోలో ఒక మహిళ.. పెరట్లో, చెట్టు కింద మంచం వేసుకుని పడుకుని ఉంది. పక్కనే పశువులు కూడా ఉన్నాయి. అయితే, ఎక్కడ్నుంచి వచ్చిందో ఒక నాగుపాము మంచంపైకి చేరి, ఆ మహిళ మీదికి ఎక్కింది. పడగవిప్పి కొద్దిసేపు అలాగే ఉంది. దీంతో ఆ మహిళ భయంతో, కదలకుండా అలాగే ఉండిపోయింది. సహాయం కోసం మెల్లిగా అర్థించింది. కొద్దిసేపు మహిళపై అలాగే ఉన్న పాము, తర్వాత అక్కడ్నుంచి వెళ్లిపోయింది. మహిళకు ఎలాంటి హానీ తలపెట్టలేదు. వీడియో చూసిన నెటిజన్లు ఒక వైపు భయానికి గురవుతూనే, మరోవైపు ఆమె ధైర్యానికి మెచ్చుకుంటున్నారు.
ఆమె చాలా లక్కీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. కావాలంటే ఆ వీడియో మీరూ చూడండి.
When this happens, what would be your reaction??
For information, the snake moved away after few minutes without out causing any harm…
(As received from a colleague) pic.twitter.com/N9OHY3AFqA— Susanta Nanda IFS (@susantananda3) August 28, 2022