Gulf Problems : విదేశాల్లో ఉద్యోగం, లక్షల్లో జీతం..కట్ చేస్తే ఘరానా మోసం… దుబాయ్‌లో చిక్కుకున్న మనీశా

విదేశాల్లో ఉద్యోగం.. లక్షల్లో జీతం వస్తుందని ఓ ఏజెంట్ చెప్పిన మాయ మాటలు నమ్మిన ఓ వివాహిత పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. దేశం కాని దేశంలో తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఉద్యోగం లేదు సరికదా తినడానికి తిండి కూడా లేక అవస్థలు పడింది. వీసా గడువు కూడా ముగియడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఎలాగో అలా దుబాయ్ లోని భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించింది.

Gulf Problems : విదేశాల్లో ఉద్యోగం, లక్షల్లో జీతం..కట్ చేస్తే ఘరానా మోసం… దుబాయ్‌లో చిక్కుకున్న మనీశా

Gulf Problems : విదేశాల్లో ఉద్యోగం.. లక్షల్లో జీతం వస్తుందని ఓ ఏజెంట్ చెప్పిన మాయ మాటలు నమ్మిన ఓ వివాహిత పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. దేశం కాని దేశంలో తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఉద్యోగం లేదు సరికదా తినడానికి తిండి కూడా లేక అవస్థలు పడింది. వీసా గడువు కూడా ముగియడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఎలాగో అలా దుబాయ్ లోని భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించింది.

విజయనగరం జిల్లా తెర్లాం గ్రామానికి చెందిన మనీషా అధికారుల సాయంతో మళ్లీ ఇంటికి చేరుకుంటోంది. ఊరిలో ఉంటే పని లేదు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఈ క్రమంలోనే గల్ఫ్ వెళితే బాగుంటుందని మనీషా అనుకుంది. అందరిలానే ఆమె కూడా ఓ ఏజెంట్ ను సంప్రదించింది. విశాఖపట్నానికి చెందిన ఓ ఏజెంట్ వీసా కోసం మనీషా నుంచి 80వేల రూపాయలు తీసుకున్నాడు. దుబాయ్ లో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని ఆశలు కల్పించాడు. జాబ్ లో డబ్బుల సంపాదించుకోవచ్చని ఆశపడ్డ మనీషా.. తన దగ్గరున్న డబ్బంతా ఏజెంట్ కు ఇచ్చింది. చెప్పినట్టుగా ఆ ఏజెంట్.. మనీషాను దుబాయ్ పంపాడు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

గల్ఫ్ దేశాల్లో భారతీయ కూలీల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో ఆశలతో దుబాయ్ చేరుకున్న మనీషాకు షాక్ తగిలింది. వెళ్లిన కొద్ది రోజులు చిన్న చిన్న ఉద్యోగాలు చూపించాడు ఏజెంట్. ఆ ఉద్యోగాలు నచ్చకపోవడంతో మంచి ఉద్యోగాలు చూపిస్తానని నమ్మబలికారు. ఆ తర్వాత వారి నుంచి స్పందన లేదు. దీంతో ఏం చేయాలో, ఎక్కడికి వెళ్లాలో మనీషాకు అర్థం కాలేదు. ఎటూ పోలేక దుబాయ్ లో చిక్కుకుపోయింది. అష్టకష్టాలు పడింది. చివరికి దుబాయ్ లోని భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించింది.

Saudi Arabia : సౌదీలో ప్రపంచ ఎనిమిదో వింత..అదేంటో తెలుసా!

తాను మోసపోయిన విషయాన్ని వివరించింది. ఆమె దగ్గరున్న వీసాను రాయబార కార్యాలయ అధికారులు పరిశీలించారు. అది కేవలం విజిటిర్స్ వీసా అని గుర్తించారు. గత నెల 31తో గడువు ముగిసిందని తెలిపారు. అయితే, భారత్ కు తిరిగి వచ్చేందుకు మనీషా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. కొన్ని రోజులుగా తిండి కూడా తినలేని దుస్థితి. ఎంబసీ అధికారులు విజయనగరం అధికారులకు సమాచారం అందించారు. తనను ఇండియా తీసుకొచ్చేందుకు దాతలు ఎవరైనా ఆర్థిక సాయం చేయాలని తన బాధలు వీడియో ద్వారా వెల్లడించింది మనీశా. తాను మోసపోయిన విషయం వివరించింది. అటు విజయంనగరం జిల్లా అధికారులు తెర్లాం గ్రామంలో మనీషా కుటుంబసభ్యులను సంప్రదించారు. అధికారుల సాయంతో ఆమెను ఇంటికి తీసుకొస్తున్నారు.