Home » Author »Narender Thiru
23 లక్షల మంది యూజర్లకు షాకిచ్చింది వాట్సాప్. గత జూలైలో 23 లక్షల అకౌంట్లను బ్లాక్ చేసినట్లు తాజాగా వాట్సాప్ వెల్లడించింది. యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా ఉన్న అకౌంట్ల�
అగ్నితో ఆటలు ఆడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే చాలా ప్రమాదం. కావాలంటే ఈ వీడియో చూడండి. ఒక యువకుడు నిప్పుతో ఆడుకోవాలనుకుంటే.. మంటలు ఒళ్లంతా అంటుకున్నాయి. కానీ, ఆ కుర్రాడు జాగ్రత్తపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది.
మదర్సాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు నిలయంగా మారితే, వాటిని కూల్చివేస్తామని హెచ్చరించారు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ. మదర్సాలను కూల్చాలన్న ఉద్దేశం తమకు లేదని, వాటిని సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉంచాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పార�
తెలంగాణ రైతుల ఆత్మహత్యల్లో నాలుగో స్థానంలో ఉందని, రైతు రుణ మాఫీ కూడా ఇంకా పూర్తి కాలేదని విమర్శించారు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రాలు చేసే అప్పుల గురించి ప్రశ్నించే అధికారం కేంద్రానికి ఉందని ఆమె గుర్తు చేశారు.
తన షాపు ముందు అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన కర్రలు తీసేయమని కోరినందుకు ఒక వృద్ధ మహిళపై అకారణంగా దాడికి పాల్పడ్డాడు ఎమ్ఎన్ఎస్ పార్టీకి చెందిన నేత. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో గత నెలలో జరిగింది.
తెలంగాణను వదిలేసి కేసీఆర్.. ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పర్యటిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ బిహార్ పర్యటనను కిషన్ రెడ్డి తప్పుబట్టారు. కేసీఆర్ నేల విడిచి సాము చేస్తున్నారని విమర్శించారు.
తెలంగాణలో అమరులైన జవాన్ల కుటుంబాలకు సీఎం కేసీఆర్‌కు కనిపించడం లేదా అని విమర్శించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. జవాన్ల మరణాలను కేసీఆర్ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని లేఖలో విమర్శించారు.
మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లింగాయత్ మఠాధిపతి శివమూర్తిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో తాజా నోటీసులు జారీ చేశారు.
ఢిల్లీ అసెంబ్లీలో గురువారం జరిగిన విశ్వాస పరీక్షలో అరవింద్ కేజ్రీవాల్ విజయం సాధించారు. ఆయన ఆధ్వర్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ భారీ మెజారిటీ సాధించి విశ్వాస పరీక్షలో నెగ్గింది. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆయన పార్టీ 58 ఓట్లు సాధించి�
అలెక్సా డివైజ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే, ఈ పేరును ఒక చిన్నారికి పెట్టారు పేరెంట్స్. దీంతో ఆ చిన్నారిని తోటి పిల్లలు ఏడిపిస్తున్నారు. ‘హే అలెక్సా’ అంటూ రకరకాల కామెంట్స్‌తో వేధిస్తున్నారు.
తీవ్రవాదులకు క్రిప్టోకరెన్సీ ఆర్థిక వనరుగా ఉపయోగపడుతుంటడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇటీవల దొరికిన అనేక తీవ్రవాద లింకుల్లో క్రిప్టోకరెన్సీ పాత్ర ఉంది. దీంతో క్రిప్టోకరెన్సీపై నియంత్రణ విధించాలని భారత ప్రభుత్వం భావిస్తోంది.
తన దగ్గర అక్రమాస్తులు ఉన్నట్లు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. నిజంగా అక్రమాస్తులు ఉన్నట్లు తేలితే బుల్డోజర్లు తీసుకొచ్చి, వాటిని కూల్చాలని అధికారులకు సూచించారు.
భారత మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ నుంచి ఆటగాడిగా తానెంతో నేర్చుకున్నానని చెప్పాడు స్టార్ ప్లేయర్ హార్ధిక్ పాండ్యా. అయితే, ఓటముల నుంచి కూడా మరిన్ని పాఠాలు నేర్చుకున్నట్లు వివరించాడు.
గౌతమ్ అదానీ సంపద పెరిగిపోవడంపై ప్రొ.కె.నాగేశ్వర్ వేసిన ట్వీట్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ రిప్లై ఇచ్చారు. దేశ ప్రజల అకౌంట్లలో డిపాజిట్ చేస్తానన్న డబ్బంతా.. మోదీ ఒక్క అకౌంట్లోనే వేశారేమో అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
దేశంలో రాబోయే కొన్ని దశాబ్దాల్లో ఎండలు భారీ స్థాయిలో పెరగబోతున్నట్లు తాజా సర్వే ఒకటి తేల్చింది. ఇండియాలాంటి అనేక ఉష్ణ మండల దేశాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని ఆ సర్వే చెప్పింది.
కర్ణాటకలో ఒక పక్క అనేక అంశాల్లో హిందూ-ముస్లింల మధ్య వివాదాలు నడుస్తుంటే.. మరోపక్క వినాయక చవితి సందర్భంగా మత సామరస్యం వెల్లివిరిసింది. వినాయక చవితి వేడుకల్లో ముస్లింలు పాల్గొన్నారు.
మోదీ ప్రభుత్వం దేశానికి చేసిందేమీ లేదన్నారు సీఎం కేసీఆర్. మోదీ పాలనలో అన్ని రంగాలు విఫలమయ్యాయన్నారు. బీజేపీని సాగనంపాల్సిన అవసరం ఉందన్నారు. బిహార్‌లోని పాట్నాలో సీఎం నితీష్ కుమార్‌తో కలిసి నిర్వహించిన ప్రెస్మీట్లో కేసీఆర్ పాల్గొన్నార�
బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని, ‘ఆపరేషన్ కమలం’ పేరుతో సాగిన ఈ కుట్రపై విచారణ జరపాలని ‘ఆప్’ డిమాండ్ చేస్తోంది. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఆప్ నేతలు నిరసనకు దిగారు.
రాష్ట్రాలకు రాయితీ ధరకే పప్పు ధాన్యాలు అందించాలని కేంద్రం నిర్ణయించింది. 15 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాల్ని తక్కువ ధరకే అందించేందుక ఆర్థిక శాఖ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఇండియా-పాక్ మ్యాచ్ సందర్భంగా సరదా కోసం పాకిస్తాన్ జెర్సీ ధరించాడో భారతీయుడు. దీంతో అతడిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.