Himanta Biswa Sarma: దేశ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే మదర్సాలు కూల్చివేస్తాం: అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ
మదర్సాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు నిలయంగా మారితే, వాటిని కూల్చివేస్తామని హెచ్చరించారు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ. మదర్సాలను కూల్చాలన్న ఉద్దేశం తమకు లేదని, వాటిని సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉంచాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు.

Himanta Biswa Sarma: మదర్సాలను దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగిస్తే వాటిని కూల్చివేస్తామని హెచ్చరించారు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ. ఇటీవలే బోన్గైగావ్ జిల్లాలోని ఒక మదర్సాలో జిహాదీ కార్యక్రమాలు నిర్వహించారని తేలడంతో, ఆ మదర్సాను అధికారులు బుధవారం కూల్చివేశారు.
ఇది రాష్ట్రంలో ప్రభుత్వం కూల్చివేసిన మూడో మదర్సా. ఈ అంశంపై సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. ‘‘మదర్సాలను కూల్చాలన్న ఆలోచనేది మాకు లేదు. వాటిని జిహాదీ కార్యక్రమాలకు వినియోగించకుండా చూడాలన్నదే మా ఉద్దేశం. ఒకవేళ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు మదర్సాలను వినియోగించారని తేలితే మాత్రం, మేం వాటిని కూల్చేస్తాం’’ అని హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు. అసోంలోని మదర్సాలు తీవ్రవాద కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నట్లు అధికారులు ఇటీవల గుర్తించారు. అసోంలోని బార్‌పేట జిల్లాలో ఉన్న ఒక మదర్సా నాలుగేళ్ళ నుంచి ఇద్దరు బంగ్లాదేశీయులకు అక్రమంగా ఆశ్రయం ఇచ్చిందని ఇటీవల అధికారులు తెలిపారు.
Kishan Reddy: ఏ పార్టీ కేసీఆర్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఈ ఇద్దరూ అన్సరుల్ బంగ్లా టీమ్ ఉగ్రవాద సంస్థకు చెందినవారని అధికారులు తెలిపారు. ఈ ఇద్దరిలో ఒక తీవ్రవాదితోపాటు మదరసా ప్రిన్సిపాల్, టీచర్ సహా, మరొకరిని అధికారులు అరెస్టు చేశారు. అనంతరం ఈ మదర్సాను సోమవారం కూల్చివేశారు. ఈ నేపథ్యంలో మదర్సాలపై ప్రభుత్వం గట్టి నిఘా పెట్టింది.