Shivamurthy Murugha: లైంగిక వేధింపుల ఆరోపణలు.. లింగాయత్ మఠాధిపతి శివమూర్తిపై లుకౌట్ నోటీసులు

మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లింగాయత్ మఠాధిపతి శివమూర్తిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో తాజా నోటీసులు జారీ చేశారు.

Shivamurthy Murugha: లైంగిక వేధింపుల ఆరోపణలు.. లింగాయత్ మఠాధిపతి శివమూర్తిపై లుకౌట్ నోటీసులు

Karnataka sexual abuse case

Updated On : September 1, 2022 / 4:42 PM IST

Shivamurthy Murugha: మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లింగాయత్ మఠాధిపతి శివమూర్తి మురుఘ శరనారుపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 15, 16 సంవత్సరాల వయసు కలిగిన ఇద్దరు మైనర్ బాలికలపై శివమూర్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

Hey Alexa: ‘ హేయ్.. అలెక్సా’ వల్ల మారిన ‘అలెక్సా’ పేరు.. అంగీకరించిన కోర్టు

మైసూరు పోలీస్ స్టేషన్లో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం ఉండటంతో, ముందు జాగ్రత్త చర్యగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీని ప్రకారం.. అంతర్జాతీయ ప్రయాణాలకు అనువైన ఎయిర్‌పోర్టులు, నౌకాశ్రయాలకు నోటీసులు జారీ చేశారు. ఆయనపై నమోదైన కేసు వివరాల ప్రకారం.. కర్ణాటక, చిత్రదుర్గలోని మఠం పరిధిలో చదువుకుంటున్న ఇద్దరు బాలికలపై శివమూర్తి మూడున్నర సంవత్సరాలు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. గత జూలై 24న ఇద్దరు బాలికలు ఆశ్రమానికి చెందిన హాస్టల్ నుంచి తప్పించుకుని పారిపోతుండగా పోలీసులు గుర్తించారు.

Arvind Kejriwal: విశ్వాస పరీక్షలో నెగ్గిన కేజ్రీవాల్ సర్కారు.. గుజరాత్‌లో తమ పార్టీకి ఓట్ల శాతం పెరిగిందన్న సీఎం

ఆ బాలికల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా నజర్బాద్ పోలీస్ స్టేషన్లో ఆయనపై పోక్సో చట్టం కింద లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. అయితే, ఇదంతా తనపై జరుగుతున్న కుట్ర అని శివమూర్తి అన్నారు.