Constable Recruitment 2022: ప్రశాంతంగా ముగిసిన కానిస్టేబుల్ రాత పరీక్ష.. తెలంగాణ వ్యాప్తంగా 6 లక్షల మంది హాజరు
తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాల అర్హత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 35 పట్టణాల్లోని, 1,601 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. 6,03,955 మంది అభ్యర్థులు హాజరయ్యారు. త్వరలోనే ప్రిలిమినరీ ‘కీ’ని విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు.

Constable Recruitment 2022: తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఆదివారం ప్రాథమిక రాత పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు 6,03,955 మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,601 కేంద్రాల్లో పరీక్ష జరిగింది.
Elon Musk: కొడుకు ప్రపంచ కుబేరుడు.. సరైన ఇల్లు లేక గ్యారేజ్‌లో నిద్రించిన తల్లి
తెలంగాణలోని 35 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో పోలిస్తే హాజరు శాతం 91.34 శాతంగా ఉంది. పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. పరీక్షకు హాజరైన అభ్యర్థుల వేలిముద్రలు, డిజిటల్ ఫొటోలను పోలీసు అధికారులు సేకరించారు. అర్హులైన అభ్యర్థులకు వీటి ఆధారంగానే ఫిజికల్ టెస్టులు, ఇతర పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 15,644 పోస్టులకుగాను, 9.54 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని, అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని అధికారులు ముందే ప్రకటించారు.
Asia Cup 2022: పాక్ ఆటగాళ్ల చేతికి నల్లటి బ్యాండ్స్.. ఎందుకో తెలుసా?
పరీక్ష 200 మార్కులకు నిర్వహించారు. ప్రతి తప్పుడు సమాధానానికి 0.2 నెగెటివ్ మార్కులు ఉంటాయి. త్వరలోనే ప్రిలిమినరీ ‘కీ’ని విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు.