Asia Cup 2022: పాక్ ఆటగాళ్ల చేతికి నల్లటి బ్యాండ్స్.. ఎందుకో తెలుసా?

ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం సాయంత్రం ఇండియాతో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు తమ చేతికి నల్లటి బ్యాండ్ ధరించారు. దీనికి కారణం ఉంది. పాకిస్తాన్‌ను ఇటీవల భారీ వరదలు ముంచెత్తాయి. ఈ వరదల్లో వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.

Asia Cup 2022: పాక్ ఆటగాళ్ల చేతికి నల్లటి బ్యాండ్స్.. ఎందుకో తెలుసా?

Updated On : August 28, 2022 / 7:05 PM IST

Asia Cup 2022: ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం సాయంత్రం ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొనే పాకిస్తాన్ ఆటగాళ్లు తమ చేతికి బ్లాక్ ఆర్మ్ బ్యాండ్ ధరించారు. ఆటగాళ్లు నల్లటి బ్యాండ్ ధరించడానికి కారణం.. పాకిస్తాన్‌లో ఇటీవల వరదల కారణంగా దాదాపు వెయ్యి మంది వరకు మరణించడమే.

PM Modi: పోషకాహార లోపంపై పోరాడాలి.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ పిలుపు

వారికి నివాళి అర్పిస్తూ ఆటగాళ్లు తమ చేతికి నల్లటి బ్యాండ్స్ ధరిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. దాదాపు 30 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. వందల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. దాదాపు వెయ్యి మంది మరణించారు. బలూచిస్తాన్, సింధ్ ప్రావిన్స్ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో వరదల కారణంగా ఇటీవల మరణించిన తమ దేశ పౌరులను స్మరిస్తూ, వారికి నివాళి అర్పిస్తూ పాక్ ఆటగాళ్లు తమ చేతికి నల్లటి బ్యాండ్స్ ధరిస్తున్నారు. ఇక ప్రస్తుతం భారతీయులంతా ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Elon Musk: కొడుకు ప్రపంచ కుబేరుడు.. సరైన ఇల్లు లేక గ్యారేజ్‌లో నిద్రించిన తల్లి

గత టీ 20 ప్రపంచ కప్‌లో పాక్ చేతిలో ఓటమికి ఈ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. ఆసియా కప్‌లో భారత్‌దే హవా. ఇప్పటికి ఏడుసార్లు ఇండియా ఆసియా కప్ గెలుచుకుంది. గత కప్ గెలిచింది కూడా ఇండియానే. దీంతో ఈసారి కూడా కప్ మనదే అంటూ భారతీయలు నమ్మకంగా ఉన్నారు.