Alan Walker ‘వరల్డ్ ఫేమస్ డీజే’ ఇన్ సిటీ.. హైదరాబాద్ రానున్న అలాన్ వాకర్

వరల్డ్ ఫేమస్ డీజేలలో ఒకడైన అలాన్ వాకర్ త్వరలో హైదరాబాద్ రానున్నాడు. వచ్చే నెలలో శంషాబాద్‌లో జరిగే ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేస్తాడు. దీనికి సంబంధించిన టిక్కెట్ల విక్రయం ప్రారంభమైంది.

Alan Walker ‘వరల్డ్ ఫేమస్ డీజే’ ఇన్ సిటీ.. హైదరాబాద్ రానున్న అలాన్ వాకర్

Updated On : August 28, 2022 / 5:26 PM IST

Alan Walker: ప్రపంచంలోని ఫేమస్ డీజేలలో ఒకరైన అలాన్ వాకర్ త్వరలో హైదరాబాద్ రానున్నాడు. వచ్చే నెలలో జరిగే ఒక మ్యూజిక్ ఈవెంట్‌లో పాల్గొనబోతున్నాడు. బ్రిటన్‌-నార్వేకు చెందిన అలాన్ వాకర్.. డీజే సాంగ్స్‌తో మ్యూజిక్ లవర్స్‌లో వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్నాడు.

PM Modi: పోషకాహార లోపంపై పోరాడాలి.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ పిలుపు

యూట్యూబర్‌గానూ, సాంగ్స్ ప్రొడ్యూసర్‌గానూ కూడా ఎంతోమందిని ఆకట్టుకున్నాడు. పాతికేళ్ల వయసున్న అలాన్ వాకర్‌కు వరల్డ్ వైడ్ అభిమానులున్నారు. ముఖ్యంగా తను ప్లే చేసే ‘అలోన్’, ‘ఫేడెడ్’, ‘ఆన్ మై వే’ సాంగ్స్‌కు మ్యూజిక్ లవర్స్‌లో పిచ్చ క్రేజ్. ‘సన్‪‌బర్న్ ఫెస్టివల్‌’తోపాటు, వివిధ దేశాల్లో జరిగే ప్రముఖ మ్యూజిక్ ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేస్తుంటాడు. తాజాగా మన దేశంలో పర్యటించేందుకు సిద్ధమయ్యాడు. వచ్చే నెలలో దేశంలోని పలు నగరాల్లో పర్యటించబోతున్నాడు. ముందుగా హైదరాబాద్‌లో మ్యూజిక్ షో చేస్తాడు. సెప్టెంబర్ 23న అలాన్ వాకర్ షో జరగబోతుంది. శంషాబాద్‌లోని‘జీఎమ్ఆర్ ఎరెనా’లో సాయంత్రం నాలుగు గంటలకు అలాన్ వాకర్ షో ప్రారంభమవుతుంది.

Perks for CJI: రిటైర్మెంట్ తర్వాత ‘సుప్రీం’ జడ్జీలకు ఉండే వసతులేంటో తెలుసా?

‘బుక్ మై షో’తోపాటు ఇతర ప్లాట్‌ఫామ్స్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. టిక్కెట్ ధర రూ.2,500 నుంచి ప్రారంభమవుతుంది. హైదరాబాద్ తర్వాత 24న చెన్నైలో, 25న అహ్మదాబాద్‌లో షో నిర్వహిస్తాడు. మన దేశంలో ‘సన్‪‌బర్న్ ఫెస్టివల్‌’ నవంబర్‌లో జరగబోతుంది. హైదరాబాద్‌లో నవంబర్ 20న షో ఉంటుంది.