Perks for CJI: రిటైర్మెంట్ తర్వాత ‘సుప్రీం’ జడ్జీలకు ఉండే వసతులేంటో తెలుసా?

న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు, న్యాయమూర్తులుగా రిటైరైన వారికి తర్వాత.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సేవలు లభిస్తాయో తెలుసా? దీనికి సంబంధించి కేంద్ర న్యాయశాఖ తాజాగా ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం...

Perks for CJI: రిటైర్మెంట్ తర్వాత ‘సుప్రీం’ జడ్జీలకు ఉండే వసతులేంటో తెలుసా?

Perks for CJI: జస్టిస్ ఎన్వీ రమణ ఇటీవలే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైరైన సంగతి తెలిసిందే. తాజాగా ఆ బాధ్యతలు చేపట్టిన జస్టిస్ యూయూ లలిత్ కూడా మరో రెండున్నర నెలల్లోనే రిటైర్ కానున్నారు. దేశంలోనే న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థాయిని అందుకున్న వీరికి రిటైర్మెంట్ తర్వాత కూడా ఉన్నత స్థాయి సేవలు లభిస్తాయి. ప్రధాన న్యాయమూర్తితోపాటు, సుప్రీంకోర్టులో జడ్జీలుగా పని చేసిన వారికి కూడా ప్రభుత్వం నుంచి పలు వసతులు అందుతాయి.

West Bengal: కలుషిత నీరు తాగి బాలుడు మృతి.. మరో 50 మందికి అస్వస్థత

ఈ అంశంపై ఇటీవలే కేంద్ర న్యాయశాఖ పలు మార్పులు చేసింది. రిటైరైన న్యాయమూర్తులకు మరిన్ని సేవలు అందించేందుకు నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈ నెల 23న తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. సుప్రీంకోర్టు జడ్జిగా రిటైరైన తర్వాత నుంచి వారి జీవితాంతం ఒక డ్రైవర్, ఆఫీస్ కార్యదర్శి సేవలందిస్తారు. డ్రైవర్.. రిటైర్డ్ జడ్జికి సహాయకుడిగా కూడా ఉండాల్సి ఉంటుంది. ప్రధాన న్యాయమూర్తిగా రిటైరైన ఐదు సంవత్సరాలపాటు నిరంతరం ఇంటి వద్ద భద్రతతోపాటు, వ్యక్తిగత భద్రత కూడా లభిస్తుంది. న్యాయమూర్తిగా రిటైరైతే ఈ సేవలు మూడు సంవత్సరాలపాటు లభిస్తాయి. ఒకవేళ రిటైరైన జడ్జికి ఏదైనా ముప్పు పొంచి ఉందని అనుమానిస్తే అదనంగా ప్రత్యేక భద్రత కూడా లభిస్తుంది. రిటైరయ్యాక ఢిల్లీలో ఆరు నెలలపాటు టైప్ -7 నివాసంలో ఉచితంగా ఉండొచ్చు.

PM Modi: పోషకాహార లోపంపై పోరాడాలి.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ పిలుపు

సాధారణంగా ఈ వసతి ఎంపీలు, కేంద్ర మంత్రులకు ఉంటుంది. ఎయిర్‌పోర్టుల్లో వీఐపీ లాంజ్ ఫెసిలిటీ జీవితాంతం ఉంటుంది. ఉచితంగా టెలిఫోన్, మొబైల్ ఫోన్, మొబైల్ డేటా వంటి సేవలు లభిస్తాయి. దీనికి మొత్తం రూ.4,200 ప్లస్ టాక్సెస్ వరకు చెల్లిస్తారు. అంతకుమించితే అదనపు బిల్లును వారే చెల్లించుకోవాలి. ప్రధాన న్యాయమూర్తికి రిటైర్మెంట్ తర్వాత రూ.70,000, న్యాయమూర్తికి రూ.39,000 ప్రతి నెలా చెల్లిస్తారు. సుప్రీంకోర్టులో 34 మంది జడ్జీలు ఉంటారు. వీరిలో సగటున ప్రతి ఏడాది ముగ్గురు రిటైర్ అవుతుంటారు.