Tamil Nadu: బస్సు ఫుట్‌బోర్డ్‌పై నుంచి పడి తొమ్మిదో తరగతి బాలుడు మృతి

బస్సు ఫుట్‌బోర్డ్‌పై నిలబడ్డ విద్యార్థి అదుపుతప్పి రోడ్డుపై పడ్డాడు. ఈ ఘటనలో ఆ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే డ్రైవర్ ఆస్పత్రికి తరలించాడు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థి మరణించాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

Tamil Nadu: బస్సు ఫుట్‌బోర్డ్‌పై నుంచి పడి తొమ్మిదో తరగతి బాలుడు మృతి

Updated On : August 29, 2022 / 4:31 PM IST

Tamil Nadu: ఫుట్‌బోర్డు ప్రయాణం ప్రమాదకరం అని చెప్పినా కొందరు నిర్లక్ష్యంగా ఉంటారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. తాజాగా బస్సు ఫుట్‌బోర్డ్‌పై నిలబడ్డ ఒక విద్యార్థి, ప్రమాదవశాత్తు కింద పడి మరణించాడు. ఈ ఘటన సోమవారం ఉదయం తమిళనాడులోని మధురై జిల్లా, ఆరపాలయం ప్రాంతంలో జరిగింది.

Viral video: పెరట్లో మంచంపై పడుకున్న మహిళ.. ఆమె మీదికెక్కిన నాగుపాము.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

ప్రభాకరన్ (14) అనే విద్యార్థి, దగ్గర్లోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం.. రోజూలాగే బస్సులో స్కూలుకు బయల్దేరాడు. అయితే, బస్సులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రభాకరన్ ఫుట్‌బోర్డ్‌పై నిలబడ్డాడు. బస్సు కొంత దూరం వెళ్లిన తర్వాత, అదుపుతప్పి, జారి.. రోడ్డుపై పడ్డాడు. వేగంగా వెళ్తున్న బస్సులోంచి కింద పడటంతో ప్రభాకరన్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

Punjab Teen: ఒక్కరోజు కూడా జిమ్‌కు వెళ్లకున్నా.. పుషప్స్‌లో గిన్నిస్ రికార్డు సృష్టించిన పంజాబ్ కుర్రాడు

వెంటనే డ్రైవర్, బాలుడిని అంబులెన్స్‌లో సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న కరిమేడు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.