పాడ్‌కాస్టింగ్, రికార్డింగ్ కోసం తక్కువ ధరకు ఇంతకంటే మంచి స్మార్ట్‌ఫోన్లు దొరకవు.. ఈ 3 ఫోన్లు అదుర్స్ అంతే..

షావోమి రెడ్‌మీ నోట్ 14 SE 5Gలో డ్యూయల్ మైక్రోఫోన్లు డ్యూయల్ స్టీరియో స్పీకర్లు Dolby Atmos‌తో వస్తాయి. ఎక్స్‌టర్నల్ మైక్రోఫోన్ కనెక్ట్ చేయాలంటే 3.5 mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంటుంది.

పాడ్‌కాస్టింగ్, రికార్డింగ్ కోసం తక్కువ ధరకు ఇంతకంటే మంచి స్మార్ట్‌ఫోన్లు దొరకవు.. ఈ 3 ఫోన్లు అదుర్స్ అంతే..

Best Phones Under 20K

Updated On : August 24, 2025 / 9:56 PM IST

Best Phones Under 20K:  పాడ్‌కాస్టింగ్, రికార్డింగ్ కోసం రూ.20 వేలలోపు మంచి స్మార్ట్‌ఫోన్ కావాలనుకునే వారు రియల్‌మీ నార్జో 80x 5G, శాంసంగ్ గెలాక్సీ A06 5G, షావోమి రెడ్మీ నోట్ 14 SE 5G గురించి తెలుసుకోవాల్సిందే. ఈ కేటగిరీలో టాప్ 3 బెస్ట్ ఫోన్లు ఇవ్వే అని చెప్పుకోవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్లలో మంచి ఆడియో ఫీచర్లు ఉంటాయి కాబట్టి బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ తగ్గుతుంది. ఈ ఫోన్లు గేమింగ్ చిప్‌సెట్‌తో వస్తాయి కాబట్టి వీడియో ఎడిటింగ్ పాడ్‌కాస్ట్ ఎడిటింగ్ వంటి హై ఎండ్ పనులు చేయవచ్చు.

అదనంగా భారీ బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది కాబట్టి ఛార్జింగ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ లైవ్ సేల్‌లో డిస్కౌంట్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. (Best Phones Under 20K)

రియల్‌ మీ నార్జో 80x 5G

రియల్‌ మీ నార్జో 80x 5G పాడ్‌కాస్టింగ్ రికార్డింగ్ కోసం ఫస్ట్ ఛాయిస్‌గా ఎంచుకోవచ్చు. నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌తో డ్యూయల్ మైక్రోఫోన్లు లభిస్తాయి. 6.72 అంగుళాల FHD ప్లస్ IPS LCD డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్ రియలిస్టిక్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది.

మీడియాటెక్ డైమెన్సిటీ 6400 5G చిప్‌సెట్ ఉంటుంది. హై ఎండ్ పనులు చేయవచ్చు. 50 MP + 2 MP రియర్ కెమెరా సెటప్ 16 MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. 6000 mAh బ్యాటరీ 45 వాట్ SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ.12,999 ఖర్చు అవుతుంది.

శాంసంగ్ గెలాక్సీ A06 5G

శాంసంగ్ గెలాక్సీ A06 5G వాయిస్ ఫోకస్ ఫీచర్‌తో డ్యూయల్ మైక్రోఫోన్లు వస్తాయి. ఇది వాయిస్ క్లారిటీ ఇస్తుంది. 6.7 అంగుళాల HD ప్లస్ IPS LCD డిస్ప్లే 90 Hz రిఫ్రెష్ రేట్ 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌తో ఉంటుంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంటుంది.

5000 mAh భారీ బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్ IP54 డస్ట్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుంది. కొనడానికి 11,499 ఖర్చు అవుతుంది.

షావోమి రెడ్‌మీ నోట్ 14 SE 5G

షావోమి రెడ్‌మీ నోట్ 14 SE 5Gలో డ్యూయల్ మైక్రోఫోన్లు డ్యూయల్ స్టీరియో స్పీకర్లు Dolby Atmos‌తో వస్తాయి. ఎక్స్‌టర్నల్ మైక్రోఫోన్ కనెక్ట్ చేయాలంటే 3.5 mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంటుంది.

6.67 అంగుళాల FHD ప్లస్ AMOLED స్క్రీన్ 120 Hz రిఫ్రెష్ రేట్ 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌తో వస్తుంది. Gorilla Glass 5 ప్రొటెక్షన్ ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 Ultra ప్రాసెసర్ పవర్ ఇస్తుంది. 5110 mAh బ్యాటరీ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ధర రూ.14,999 ఉంటుంది. హయ్యర్ వేరియంట్ కోసం రూ.15 వేల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది.