Rajasingh: ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ అరెస్ట్.. ఉద్రిక్తత మధ్య అదుపులోకి తీసుకున్న పోలీసులు

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తీవ్ర ఉద్రిక్తత మధ్య గురువారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇంటిలోకి చొరబడ్డ పోలీసులు బలవంతంగా ఆయనను తీసుకెళ్లారు.

Rajasingh: ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ అరెస్ట్.. ఉద్రిక్తత మధ్య అదుపులోకి తీసుకున్న పోలీసులు

Rajasingh: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను గురువారం మధ్యాహ్నం పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు ఉదయమే పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. అనంతరం కొద్ది గంటల్లోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

Liger Locks OTT Partner: ఇవాళే రిలీజ్.. అప్పుడే ఓటీటీ ఫిక్స్..!

రాజాసింగ్ ఇంట్లోకి చొచ్చుకెళ్లిన పోలీసులు, ఆయనను బలవంతంగా అరెస్టు చేశారు. తీవ్ర ఉద్రిక్తత మధ్య రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అయితే, ఏ కేసులో ఆయనను అరెస్టు చేశారో ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం రాజాసింగ్‌ అరెస్టు నేపథ్యంలో ఆయన ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉదయం షాహినాయత్ గంజ్, మంగళ్‌హట్ పోలీసులు రాజాసింగ్‌కు 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19, ఏప్రిల్ 12న రాజాసింగ్‌పై నమోదైన కేసుల్లో ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఈ నోటీసులపై ఆయన స్పందించారు.

Anupama Parameswaran: కార్తికేయ-2 టీమ్‌కు షాక్.. అనుపమ పరమేశ్వరన్‌కు కరోనా పాజిటివ్!

పాత కేసుల్లో తనను మరోసారి అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసులు నమోదైన ఆరు నెలల వరకు పోలీసులు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. మరోవైపు రాజాసింగ్ రిమాండ్‌పై పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టు.. ఆయన రిమాండ్‌కు అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రేపు విచారణ జరగనుంది. రాజాసింగ్‪ను పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించబోతున్నారు. అంతకుముందు ఆయనను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆయనపై దేశవ్యాప్తంగా 42 కేసులు నమోదైనట్లు సమాచారం. అయితే, ఆయన అరెస్టు సంగతి తెలియదని రాజాసింగ్ లాయర్ వెల్లడించారు.