Home » Author »Narender Thiru
ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందన్న విషయం వెలుగులోకి రావడంతో ఆ పార్టీ అప్రమత్తమైంది. గురువారం ఉదయం పార్టీ ఎమ్మెల్యేలతో అరవింద్ కేజ్రీవాల్ సమావేశం ఏర్పాటు చేశారు.
దళిత విద్యార్థిపై టీచర్ దారుణంగా దాడి చేశాడు. తలకు బలమైన గాయం కావడంతో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి స్పృహ కోల్పోయాడు. వెంటనే తల్లిదండ్రులు అతడిని ఆస్పత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు.
తన పర్యటనలో అడ్డంకులు సృష్టించిన వైసీపీ నాయకులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కుప్పంలో వైసీపీ జెండాలు కట్టి, టీడీపీ నాయకుల్ని వైసీపీ నేతలు ఇబ్బంది పడ్డారు. దీనిపై స్పందించిన చంద్రాబాబు వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.
బిహార్ అసెంబ్లీలో బుధవారం జరిగిన విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ విజయం సాధించారు. 243 స్థానాలున్న అసెంబ్లీలో నితీష్.. 160 సీట్ల మెజారిటీ సాధించారు. అయితే, విశ్వాస పరీక్షకు ముందే బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది.
పాకిస్తాన్ చేతిలో భారత్ అనూహ్యంగా ఓడిపోయన ఒక మ్యాచ్ గురించి తలచుకున్నప్పడల్లా తనకు నిద్రపట్టదని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ వెల్లడించారు. పాక్ గెలవాలంటే చివరి బంతికి నాలుగు పరుగులు కావాలి. అయితే, పాక్ బ్యాట్స్‌మెన్ సిక్స్ కొట్టి ఆ మ్యాచ�
అక్రమ మైనింగ్ విషయంలో సోదాలు నిర్వహిస్తున్న ఈడీ అధికారులకు ఒక నిందితుడి నివాసంలో రెండు ఏకే-47 రైఫిళ్లు లభించాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి రెండూ భారత జవాన్లకు చెందినవని పోలీసులు తెలిపారు.
స్కూలు ఫీజు చెల్లించలేదని విద్యార్థుల్ని ఐదు గంటలు లైబ్రరీ గదిలో బంధించింది యాజమాన్యం. అంతేకాదు.. ఫ్యాన్ గాలి కూడా రాకుండా పవర్ తీసేశారు. విద్యార్థులతో స్కూలు యాజమాన్యం అమానవీయంగా ప్రవర్తించిన ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశా�
తన వాట్సాప్ మెసేజ్‌తో వచ్చిన లింక్‌పై క్లిక్ చేసిందో మహిళ. అంతే ఆమె బ్యాంక్ అకౌంట్లో ఉన్న రూ.21 లక్షలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. ఆ లింక్ ద్వారా ఆమె ఫోన్ హ్యాక్ చేసి, డబ్బులు కొట్టేశారు. ఇలాంటి మెసేజెస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు స�
గత మార్చిలో బ్రహ్మోస్ క్షిపణి మిస్‌ఫైర్ జరిగి పాకిస్తాన్ భూభాగంలో పడిన ఘటనపై భారత ప్రభుత్వం స్పందించింది. ఘటన జరిగిన ఆరు నెలల తర్వాత.. దీనికి ముగ్గురు అధికారుల్ని బాధ్యుల్ని చేస్తూ వారిని విధుల్లోంచి తొలగించింది.
స్కూలుకు వెళ్లడం ఇష్టం లేని విద్యార్థి అది తప్పించుకునేందుకు జైలుకు వెళ్లాలనుకున్నాడు. ఇందుకోసం నేరం చేయాలని భావించాడు. ఏకంగా స్నేహితుడినే గొంతు కోసం చంపేశాడు.
లావుగా ఉన్నాడంటూ ఆ యువకుడిని వదిలేసి వెళ్లింది ప్రేయసి. అయితే, అందరిలా బాధపడుతూ కూర్చోకుండా ఇప్పుడు శరీరాన్ని అందంగా మలచుకున్నాడు ఆ యువకుడు. భారీ కాయాన్ని అద్భుతమైన దేహంగా మలచుకున్న అతడి జర్నీ స్ఫూర్తిదాయకం.
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి కోర్టు మంగళవారం సాయంత్రం బెయిల్ మంజూరు చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు సీఆర్పీసీ సెక్షన్ 41-ఏ కింద బెయిల్ మంజూరు చేసింది.
వేరే వాళ్ల కోసం తెచ్చిన ఫుడ్ తీసుకోవడమే కాకుండా.. ఆ ఫుడ్ తెచ్చిన డెలివరీ పార్ట్‌నర్‌పై బూటుతో దాడి చేసిందో యువతి. ఈ ఘటనను అక్కడున్న వాళ్లు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అన్న తిట్టాడని మనస్థాపంతో ఇద్దరు అక్కాచెల్లెళ్లు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వరుసకు అక్కచెల్లెళ్లు అయ్యే ఇద్దరూ టీనేజర్లే. ఒకరి వయసు 15కాగా, మరొకరి వయసు 16. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు పాకిస్తాన్ తీవ్రవాదుల్ని భారత సైన్యం కాల్చి చంపింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత రాజౌరి సెక్టర్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
బిల్కిస్ బానో కేసులో నిందితులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. నిందితుల విడుదలను వ్యతిరేకిస్తూ తాజాగా సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
గోషామహల్ ఎమ్మెల్యే, తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బీజేపీ, తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది.
దళిత యువకుడిపై చెప్పుతో దాడి చేశాడో వ్యక్తి. మరో వ్యక్తి దీనికి సహకరించాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ పరిధిలో ఇటీవల జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మెయిన్ గేటు తీయడం కాస్త ఆలస్యమైనందుకు సెక్యూరిటీ గార్డుపై దాడికి యత్నించిందో మహిళ. ఈ ఘటన నోయిడాలో జరిగింది. ఈ ఘటనను వీడియో తీయగా, అదిప్పుడు వైరల్‌గా మారింది.
అసోంలో జరగబోతున్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పరీక్ష సందర్భంగా అన్ని జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నాయి. పరీక్ష పూర్తయ్యే వరకు అంటే నాలుగు గంటలపాటు ఇంటర్నెట్ సేవలను ఆపేస్తారు. ఈ నెల 28 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి.