Home » Author »Narender Thiru
కాలేజీ యాజమాన్యం ఫీజు కోసం వేధిస్తుండటంతో విద్యార్థి తన ఒంటికి నిప్పంటించుకున్నాడు. తర్వాత ప్రిన్సిపాల్‌ను పట్టుకున్నాడు. ఈ ఘటనలో ప్రిన్సిపాల్, విద్యార్థి.. ఇద్దరూ గాయపడ్డారు. ప్రస్తుతం ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖి షో అనుమతి నిలిపివేశారు పోలీసులు. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో శనివారం మునావర్ ఫారూఖి షో జరగాల్సి ఉంది. ప్రస్తుతం షో అనుమతిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు పోలీసులు ప్రకటించారు.
కరోనా ఆంక్షలతో రెండేళ్లుగా సరిగ్గా జరగని ఉట్టి కొట్టుడు (దహీ హండీ) కార్యక్రమం ఈ సారి ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన పార్టీలు విజేతలకు నగదు బహుమతులు కూడా ప్రకటించాయి. రూ.55 లక్షల వరకు బహుమతులు అందించబోతున్నాయి.
ప్రేమ పేరుతో నమ్మించి, డిగ్రీ చదువుతున్న విద్యార్థినిని గర్భవతిని చేశాడో యువకుడు. అయితే, గర్భం తొలగించేందుకు ప్రయత్నించాడు. ప్రైవేటు ఆస్పత్రిలో అబార్షన్ చేయిస్తుండగా, వైద్యం వికటించి యువతి మరణించింది.
విదేశీ అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్స్‌ను మార్చినట్లుగా బిహార్ సీఎం నితీష్ కుమార్ పొత్తుల కోసం పార్టీలు మారుస్తుంటాడని విమర్శించాడు మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే. ఇటీవలే కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సం�
ఔషధ తయారీ సంస్థలు తాము తయారు చేసే ట్యాబ్లెట్లు, మెడిసిన్ సూచించినందుకు డాక్టర్లకు భారీగా తాయిలాలు ఇస్తున్నాయని, ఇలాంటి వాటిని నియంత్రించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది.
బిల్కిస్ బానోపై అత్యాచారం కేసులో 11 మంది నిందితులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. బీజేపీని, ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శించారు.
ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆ దేశం. వచ్చే నెల నుంచి ఆఫ్‌లైన్ క్లాసులు ప్రారంభమవ్వబోతున్నట్లు తెలిపింది. విద్యార్థుల భద్రతకు కూడా కట్టుబడి ఉన్నామని ప్రకటించింది.
ఇకపై అన్ని రకాల గ్యాడ్జెట్లకు ఒకే చార్జర్ వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం త్వరలో ‘వన్ నేషన్-వన్ చార్జర్’ పేరుతో కొత్త విధానం తీసుకురాబోతుంది. దీని ప్రకారం దేశంలో విడుదలయ్యే అన్ని గ్యాడ్జెట్లను ఒకే రకమైన చార్జర్ వాడగలిగేలా తయార
బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ఆ పార్టీ సీనియర్ నేత, సినీ నటి విజయశాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను పార్టీ సరిగ్గా ఉపయోగించుకోవడం లేదన్నారు. తాను కొంతకాలంగా ఎందుకు సైలైంట్‌గా ఉన్నానో బండి సంజయ్‌నే అడగాలన్నారు.
సల్మాన్ రష్దీ ఇంకా బతికే ఉన్నాడనే విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయినట్లు చెప్పాడు అతడిపై హత్యాయత్నం చేసిన హదీ మటార్. ఒక వీడియో ఇంటర్వ్యూ సందర్భంగా హదీ పలు సంచలన విషయాలు వెల్లడించాడు.
‘గాంధీ’ సినిమా చూసేందుకు వెళ్లిన స్కూల్ విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటన గురువారం ఉదయం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో జరిగింది. ఘటనలో విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారని ప్రిన్సిపాల్ తెలిపారు.
మంకీపాక్స్ వ్యాక్సిన్ వంద శాతం సురక్షితం కాదని.. అందువల్ల వ్యాధి సోకకుండా చూసుకోవడమే మేలని ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మరోవైపు దేశంలో మంకీపాక్స్ వ్యాక్సిన్ తయారీ కోసం కేంద్రం ప్రయత్నిస్తోంది.
భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నట్లు అనుమానించింది అతడి భార్య. దీనిపై భర్తతో గొడవ పడింది. తర్వాత అతడి మర్మాంగాలపై వేడి నీళ్లు పోసింది. తీవ్రంగా గాయపడ్డ భర్త ప్రస్తుతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
రష్యాలో జనాభా తగ్గిపోతుండటంపై అధ్యక్షుడు పుతిన్ ఆందోళన చెందుతున్నాడు. అందుకే జనాభా పెంచేందుకు ఒక పథకాన్ని ప్రవేశపెట్టాడు. దీని ప్రకారం.. పది మంది పిల్లల్ని కన్న మహిళకు మన కరెన్సీలో రూ.13 లక్షల సాయం అందిస్తానని ప్రకటించాడు.
వివాహేతర సంబంధం విషయంపై కుటుంబ సభ్యులు నిందించడంతో మనస్థాపానికి గురయ్యాడో వ్యక్తి. దీంతో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాడు. అయిత, తనతోపాటు ముగ్గురు కూతుళ్లను కూడా చంపేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.
జమ్ము-కాశ్మీర్లో నివసించే ఇతర ప్రాంతాల వారికి కూడా అక్కడ ఓటు హక్కు కల్పిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ పనిచేసే కూలీలు, ఉద్యోగులు, వ్యాపారులు, భద్రతా సిబ్బంది.. ఇలా ఎవరైనా ఓటర్లుగా పేరు నమోదు చేసుకోవచ్చు.
ట్విట్టర్ ద్వారా మహిళల హక్కుల గురించి గళమెత్తినందుకు ఒక 34 ఏళ్ల మహిళకు 34 ఏళ్ల జైలు శిక్ష విధించింది సౌదీ అరేబియా. దీనిపై అంతర్జాతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాజా తీర్పుపై మహిళ పైకోర్టులో అప్పీలుకు వెళ్లే ఛాన్స్ ఉంది.
అనారోగ్యంతో బాధపడుతున్న ఏనుగుకు చికిత్స అందించకుండా రెండు రాష్ట్రాల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. తమిళనాడు-కేరళ సరిహద్దులో, ఏనుగు అటూ ఇటూ తిరుగుతుండటమే అధికారులకు సమస్యగా మారింది.
తెలంగాణ బస్సుల్లో ఇకపై సీసీ కెమెరాలు, అలారంలు కనిపించబోతున్నాయి. ఇప్పటికే కొన్ని బస్సుల్లో ప్రయోగాత్మకంగా వీటిని ఏర్పాటు చేశారు. రాబోయే రెండు నెలల్లో మరిన్ని బస్సుల్లో ఏర్పాటు చేస్తారు.