Dahi Handi: ఉట్టికొడితే రూ.55 లక్షలు.. స్పెయిన్ యాత్ర.. భారీ బహుమతులు ప్రకటించిన పార్టీలు

కరోనా ఆంక్షలతో రెండేళ్లుగా సరిగ్గా జరగని ఉట్టి కొట్టుడు (దహీ హండీ) కార్యక్రమం ఈ సారి ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన పార్టీలు విజేతలకు నగదు బహుమతులు కూడా ప్రకటించాయి. రూ.55 లక్షల వరకు బహుమతులు అందించబోతున్నాయి.

Dahi Handi: ఉట్టికొడితే రూ.55 లక్షలు.. స్పెయిన్ యాత్ర.. భారీ బహుమతులు ప్రకటించిన పార్టీలు

Updated On : August 19, 2022 / 12:29 PM IST

Dahi Handi: ‘కృష్ణాష్టమి’ అంటే ఉట్టి కొట్టుడు (దహీ హండీ) కార్యక్రమం ఉండాల్సిందే. దేశవ్యాప్తంగా అనేక చోట్ల ‘కృష్ణాష్టమి’ సందర్భంగా ఈ కార్యక్రమం సాగుతుంది. ఈసారి ఉట్టి కొట్టిన యువతకు బహుమతులు ఇచ్చేందుకు మహారాష్ట్రకు చెందిన పలు రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి.

Pregnant Died: డిగ్రీ యువతిని గర్భవతిని చేసిన యువకుడు.. అబార్షన్ చేయిస్తుండగా యువతి మృతి

రెండేళ్లుగా కరోనా ఆంక్షలతో దహీ హండీ కార్యక్రమం సరిగ్గా జరగలేదు. ఈ సారి ఆంక్షలేమీ లేకపోవడంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించే సంస్థలతోపాటు, వివిధ రాజకీయ పార్టీలు భారీ నగదు బహుమతులు ప్రకటించాయి. రూ.1.1 లక్షల నుంచి రూ.55 లక్షల వరకు నగదు బహుమతులు అందించబోతున్నాయి. మహారాష్ట్ర నిర్మాణ సేన (ఎమ్ఎన్ఎస్) పార్టీ ఈ ఏడాది ఈ కార్యక్రమం కోసం రూ.55 లక్షల బహుమతి ప్రకటించింది. ఇందులో విజేతకు రూ.11 లక్షలు అందించబోతున్నారు. అంతేకాదు… గతంలో దహీ హండీకి సంబంధించి ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొడితే ఆ బృందాన్ని స్పెయిన్ విహార యాత్రకు పంపిస్తామని కూడా ప్రకటించింది.

Rahul Gandhi: రేపిస్టులకు మద్దతు.. సిగ్గనిపించడం లేదా.. ప్రధానిపై రాహల్ ఫైర్

బీజేపీ ఆధ్వర్యంలో ముంబై నగరవ్యాప్తంగా 300కు పైగా దహీ హండీ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆదిత్యా థాక్రే నియోజకవర్గమైన వొర్లిలో అతిపెద్ద దహీ హండీ కార్యక్రమం చేపట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇతర పార్టీలు కూడా తమ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం ‘కృష్ణాష్టమి’ వేడుకలు శుక్రవారం ఘనంగా జరగబోతున్నాయి.