Rahul Gandhi: రేపిస్టులకు మద్దతు.. సిగ్గనిపించడం లేదా.. ప్రధానిపై రాహల్ ఫైర్

బిల్కిస్ బానోపై అత్యాచారం కేసులో 11 మంది నిందితులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. బీజేపీని, ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శించారు.

Rahul Gandhi: రేపిస్టులకు మద్దతు.. సిగ్గనిపించడం లేదా.. ప్రధానిపై రాహల్ ఫైర్
ad

Rahul Gandhi: బిల్కిస్ బానోపై అత్యాచారం చేసిన నిందితులను విడుదల చేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ మేరకు బీజేపీపై, మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. క్రిమినల్స్‌కు బీజేపీ మద్దతివ్వడాన్నిబట్టి ఆ పార్టీ మహిళలపై ఎలాంటి వైఖరితో ఉందో అర్థమవుతోందన్నారు. ఈ అంశంపై రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

Indian Students: భారత విద్యార్థులకు గుడ్ న్యూస్.. మెడికల్ విద్యార్థులు తిరిగి రావాలన్న ఉక్రెయిన్

‘‘ఉన్నావ్‌లో తన పార్టీ ఎమ్మెల్యేను కాపాడుకునేందుకు బీజేపీ ప్రయత్నించింది. కథువాలో రేపిస్టులకు మద్దతుగా ర్యాలీ చేశారు. హథ్రాస్‌లో ప్రభుత్వం రేపిస్టులకు అనుకూలంగా వ్యవహరించింది. గుజరాత్‌లో రేపిస్టులను విడుదల చేసి గౌరవించింది. క్రిమినల్స్‌కు బీజేపీ మద్దతు ఇస్తుండటాన్నిబట్టి, మహిళల విషయంలో ఆ పార్టీ ఎలాంటి సంకుచిత వైఖరితో ఉందో అర్థమవుతుంది. మోదీజీ ఇలాంటి రాజకీయాలు చేస్తున్నందుకు సిగ్గుగా అనిపించడం లేదా’’ అని రాహుల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశంలో బీజేపీని విమర్శిస్తోంది. ‘‘అత్యాచారం, హత్య చేసిన నిందితులను విడుదల చేయడం ద్వారా గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం బాధితురాలైన బిల్కిస్ బానో కుటుంబానికే కాదు.. మొత్తం సమాజానికే బాధ కలిగించింది’’ అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది.

Nagababu On Mega Carnival: మెగా కార్నివల్‌కు భారీ ఏర్పాట్లు.. అభిమానులకు పండగే అంటోన్న నాగబాబు

కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కూడా బీజేపీ తీరును తప్పుబట్టారు. ‘‘నిందితులను విడుదల చేసేందుకు నియమించిన నిపుణుల కమిటీలో బీజేపీ ఎమ్మెల్యేలే ఇద్దరు ఉన్నారు. మరో సభ్యుడు గోద్రా కేసుతో సంబంధం ఉన్న వ్యక్తి. ఇలాంటి వాళ్లు తటస్థంగా, న్యాయబద్ధంగా ఉండగలరా’’ అని చిదంబరం ప్రశ్నించారు. ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బిల్కిస్ బానోపై అత్యాచారం చేయడంతోపాటు, ఆమె కుటుంబ సభ్యులను చంపిన 11 మంది ఖైదీలు విడుదలైన సంగతిత తెలిసిందే.