Nagababu On Mega Carnival: మెగా కార్నివల్‌కు భారీ ఏర్పాట్లు.. అభిమానులకు పండగే అంటోన్న నాగబాబు

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న ఉండటంతో, ఆరోజున మెగా ఫ్యాన్స్ హంగామా అంతా ఇంతా ఉండదు. ఇక ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా జరిపేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు. కాగా, మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఏర్పాట్లను మెగా బ్రదర్ నాగబాబు సమీక్షించారు.

Nagababu On Mega Carnival: మెగా కార్నివల్‌కు భారీ ఏర్పాట్లు.. అభిమానులకు పండగే అంటోన్న నాగబాబు
ad

Nagababu On Mega Carnival: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న ఉండటంతో, ఆరోజున మెగా ఫ్యాన్స్ హంగామా అంతా ఇంతా ఉండదు. ఇక ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా జరిపేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు. ప్రతి యేటా ఆయన పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యాన్స్ చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. దీంతో ఈసారి చిరు పుట్టినరోజును గ్రాండ్‌గా నిర్వహించేందుకు మెగా ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.

Megastar Chiranjeevi : డియర్ మెగా ఫ్యాన్స్.. ఘరానా మొగుడు మెగాస్టార్ బర్త్ డేకి.. ఇంద్ర త్వరలో.. మళ్ళీ థియటర్స్ లో రచ్చ చేయబోతున్నాయి..

కాగా, మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఏర్పాట్లను మెగా బ్రదర్ నాగబాబు సమీక్షించారు. ఈ క్రమంలో ఆయన ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం అన్నయ్య బర్త్ డేను శిల్పకళా వేదికలో చేసేవాళ్ళం.. ఈ సంవత్సరం కొంచెం కొత్తగా చేద్దామని ప్లాన్ చేశాము.. చిరంజీవి గారి బర్త్‌డే ఆయన్ను అభిమానించే వాళ్ళందరికీ పండుగ.. బర్త్‌డే వేడుకల్లో అభిమానులు కూడా ప్రత్యక్షంగా పాల్గొని ఎంజాయ్ చెసే విధంగా డిజైన్ చేశారని నాగబాబు అన్నారు.

Megastar Chiranjeevi: ప్రాణాపాయంలో మెగాభిమాని.. అండగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి

అభిమానుల కోసం కార్నివాల్ ఫెస్టివల్‌ని హైటెక్స్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఇండియాలో ఏ సినిమా హిరోకి కార్నివాల్ లాంటిది పెట్టలేదు. అది అన్నయ్యకే దక్కింది. ఈ కార్నివాల్ ఫెస్టివల్ అనేది ఫ్యాన్స్‌కి ఒక మెమొరుబల్ డేగా ఉండాలి.. చాలా ఊళ్ళలో చిరంజీవి బర్త్ డేని పండగ లాగా చేసుకుంటారు.. కార్నివాల్‌లో అన్ని ప్రాంతాల అభిమానులు పాల్గొనాలి.. అన్ని సదుపాయాలు ఈ కార్నివాల్‌లో ఉంటాయి.. నేను కార్నివాల్‌లో చిరంజీవి గారి గురించి ఎవ్వరికీ తెలియని విషయం చెబుతాను.. చిరంజీవి గారి బర్త్‌డే అంటే మా ఇంట్లో పెద్ద పండుగ.. కార్నివాల్ అనేది ఒక మెమొరబుల్‌గా ఉండాలి.. ఈ కార్నివాల్ ఫెస్టివల్‌కి మా ఫ్యామిలీలోని అందరు హిరోలు పాల్గొంటారు.. ఇతర హీరోలు, ఆయన్ను అభిమానించే వారు అందరూ ఈ ఫెస్టివల్‌లో పాల్గొంటారు.. అని మెగా బ్రదర్ నాగబాబు తెలిపారు.