Megastar Chiranjeevi : డియర్ మెగా ఫ్యాన్స్.. ఘరానా మొగుడు మెగాస్టార్ బర్త్ డేకి.. ఇంద్ర త్వరలో.. మళ్ళీ థియటర్స్ లో రచ్చ చేయబోతున్నాయి..

ఇటీవల గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలని ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా తీర్చిదిద్ది ఫ్యాన్స్ కోసం థియేటర్స్ లో స్పెషల్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన పోకిరి సినిమాని............

Megastar Chiranjeevi : డియర్ మెగా ఫ్యాన్స్.. ఘరానా మొగుడు మెగాస్టార్ బర్త్ డేకి.. ఇంద్ర త్వరలో.. మళ్ళీ థియటర్స్ లో రచ్చ చేయబోతున్నాయి..

chiranjeevi

Megastar Chiranjeevi :  ఇటీవల గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలని ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా తీర్చిదిద్ది ఫ్యాన్స్ కోసం థియేటర్స్ లో స్పెషల్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన పోకిరి సినిమాని దాదాపు 200 థియేటర్లలో రిలీజ్ చేయగా హౌస్ ఫుల్ తో మరోసారి కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో మిగిలిన హీరోల అభిమానులు కూడా తమ హీరోల కెరీర్లో ఒకప్పటి హిట్ సినిమాలని 4K వర్షన్ లో మళ్ళీ థియేటర్స్ లో రిలీజ్ చేయాలని కోరుతున్నారు.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం పవన్ పుట్టిన రోజున జల్సా సినిమాని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తాజాగా మెగా ఫ్యాన్స్ కోసం చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన రెండు సినిమాలని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే చిరంజీవి పుట్టిన రోజున ఘరానా మొగుడు సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఇంద్ర సినిమాని కూడా రిలీజ్ చేస్తాం అంటూ ఆ సినిమా నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఓ ట్వీట్ చేసింది.

Vijay Devarakonda : నేనింకా చిన్న పిల్లాడ్ని.. సూపర్ స్టార్ అని పిలుస్తుంటే ఇబ్బందిగా ఉంది..

ఈ ట్వీట్ లో.. ”డియర్‌ మెగా ఫ్యాన్స్‌.. ‘ఇంద్ర’ను 4కె వెర్షన్‌లో మీ ముందుకు తీసుకురానున్నాం. అయితే అది ఇప్పుడే కాదు. దానికి కాస్త సమయం పడుతుంది. ఆరోజు కోసం మీరే కాదు మేము కూడా ఎదురుచూస్తున్నాం. ఏది ఏమైనా ఈ సినిమా రీ రిలీజ్‌ మాత్రం గ్రాండ్‌ లెవల్‌లో జరగనుంది’’ అని తెలిపింది. దీంతో అధికారికంగా నిర్మాణ సంస్థే చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఇంద్ర రిలీజ్ పై ఇలా ట్వీట్ చేయడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం అని అంటున్నారు ఫ్యాన్స్.