Pregnant Died: డిగ్రీ యువతిని గర్భవతిని చేసిన యువకుడు.. అబార్షన్ చేయిస్తుండగా యువతి మృతి

ప్రేమ పేరుతో నమ్మించి, డిగ్రీ చదువుతున్న విద్యార్థినిని గర్భవతిని చేశాడో యువకుడు. అయితే, గర్భం తొలగించేందుకు ప్రయత్నించాడు. ప్రైవేటు ఆస్పత్రిలో అబార్షన్ చేయిస్తుండగా, వైద్యం వికటించి యువతి మరణించింది.

Pregnant Died: డిగ్రీ యువతిని గర్భవతిని చేసిన యువకుడు.. అబార్షన్ చేయిస్తుండగా యువతి మృతి

Updated On : August 19, 2022 / 11:58 AM IST

Pregnant Died: ప్రేమ పేరుతో డిగ్రీ యువతిని నమ్మించి గర్భవతిని చేశాడో యువకుడు. తర్వాత యువతికి అబార్షన్ చేయించాడు. అయితే, వైద్యం వికటించి యువతి మృతి చెందింది. ఈ ఘటన తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూక్యా నందు అనే యువకుడు డిగ్రీ సెకండియర్ చదువుతున్న ఒక యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడు.

Supreme Court: డోలో ట్యాట్లెట్ రాసినందుకు డాక్టర్లకు వెయ్యి కోట్లు… సుప్రీం కోర్టులో విచారణ

ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. గర్భం తొలగించేందుకు ఒక ప్రైవేటు ఆస్పత్రిలో అబార్షన్ చేయించేందుకు ప్రయత్నించాడు. అబార్షన్ చేస్తుండగా, వైద్యం వికటించి యువతి మృతి చెందింది. విషయం తెలుసుకున్న భూక్యా నందు అక్కడ్నుంచి పరారయ్యయాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. యువకుడి కోసం గాలిస్తున్నారు.