Supreme Court: డోలో ట్యాట్లెట్ రాసినందుకు డాక్టర్లకు వెయ్యి కోట్లు… సుప్రీం కోర్టులో విచారణ

ఔషధ తయారీ సంస్థలు తాము తయారు చేసే ట్యాబ్లెట్లు, మెడిసిన్ సూచించినందుకు డాక్టర్లకు భారీగా తాయిలాలు ఇస్తున్నాయని, ఇలాంటి వాటిని నియంత్రించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది.

Supreme Court: డోలో ట్యాట్లెట్ రాసినందుకు డాక్టర్లకు వెయ్యి కోట్లు… సుప్రీం కోర్టులో విచారణ

Supreme Court: ప్రిస్క్రిప్షన్‌లో డోలో ట్యాబ్లెట్ రాసినందుకు, తయారీ సంస్థలు డాక్టర్లకు దాదాపు వెయ్యి కోట్ల రూపాయల తాయిలాలు అందించినట్లు ఆరోపించింది ఒక సంస్థ. ఔషధ తయారీ సంస్థలు తాము తయారు చేసే ఔషధాల్ని రోగులకు సూచించాలని చెబుతూ, డాక్టర్లకు ప్రోత్సహకాలు అందిస్తున్నాయని, అలాంటి ఫార్మా కంపెనీలపై చర్యలు తీసుకోవాలంటూ ఒక పిటిషన్ దాఖలైంది.

Indian Students: భారత విద్యార్థులకు గుడ్ న్యూస్.. మెడికల్ విద్యార్థులు తిరిగి రావాలన్న ఉక్రెయిన్

ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బొపన్నతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరుపుతోంది. జ్వరానికి వాడే డోలో-650ని సూచించినందుకే తయారీ సంస్థలు డాక్టర్లకు వెయ్యి కోట్ల రూపాయల తాయిలాలు అందించినట్లు ఆ సంస్థ పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఇది చాలా తీవ్రమైన సమస్య అని వ్యాఖ్యానించింది. దీనిపై పది రోజుల్లోగా సమాధానం చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. డోలో 650 తయారు చేసే సంస్థపై ఇటీవల కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ (సీబీడీటీ) దాడులు చేసిన సంగతి తెలిసిందే.

Rahul Gandhi: రేపిస్టులకు మద్దతు.. సిగ్గనిపించడం లేదా.. ప్రధానిపై రాహల్ ఫైర్

దాదాపు రూ.300 కోట్ల పన్నుల్ని ఈ సంస్థ ఎగవేసిందని సీబీడీటీ గుర్తించింది. సుప్రీంలో దాఖలైన పిటిషన్‌లో అనేక కీలక అంశాల్ని పొందుపరిచారు. కేంద్ర నిబంధనల ప్రకారం 500 ఎంజీ వరకు ఉన్న ట్యాబ్లెట్ల ధరల్ని నియంత్రించే అధికారం ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. అంతకుమించిన ఎంజీ అయితే ఆ ట్యాబ్లెట్ల ధరల్ని కంపెనీలు ఇష్టానుసారం నిర్ణయించుకుంటాయి. దీంతో తయారీ సంస్థలు భారీగా ధరల్ని పెంచేసి, వాటిని డాక్టర్లతో సిఫారసు చేయిస్తూ అధిక మొత్తంలో లాభాల్ని పొందుతున్నాయి. అధిక మొత్తంలో ట్యాబ్లెట్లను డాక్టర్లు సిఫారసు చేయడం వల్ల మెడిసిన్ ఓవర్ డోసు కావొచ్చని, అలాగే అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Nagababu On Mega Carnival: మెగా కార్నివల్‌కు భారీ ఏర్పాట్లు.. అభిమానులకు పండగే అంటోన్న నాగబాబు

ఫార్మా కంపెనీల మార్కెటింగ్ కోసం ఒక యునిఫామ్ కోడ్ రూపొందించి, వాటిని కఠినంగా అమలయ్యేలా చూడాలని, జవాబుదారీతనం, పారదర్శకత ఉండేలా చూడాలని పిటిషన్‌దారులు సుప్రీంకోర్టును కోరారు.