Kattalan: మార్కో మేకర్స్ కొత్త మూవీ.. ప్రధాన పాత్రలో సునీల్.. భలే స్పెషల్ గా డిజైన్ చేశారుగా!
మార్కో.. బాక్సాఫిస్ దగ్గర ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ ను అంత(Kattalan) ఈజీగా మర్చిపోలేం. ఉన్ని ముకుందన్ హీరోగా వచ్చిన

The new film coming from Marco Filmmakers is Kattalan
Kattalan: మార్కో.. బాక్సాఫిస్ దగ్గర ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ ను అంత ఈజీగా మర్చిపోలేం. ఉన్ని ముకుందన్ హీరోగా వచ్చిన ఈ వైలెంట్ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. హింస ఎక్కువగా ఉందని కామెంట్స్ వినిపించినా.. ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను ఎగబడి మరీ చూశారు. ఇప్పుడు ఆ సినిమాను నిర్మించిన మేకర్స్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదే కాటాలన్(Kattalan).
Upasana: నేను ఎవరి దయ వల్లా ఎదగలేదు.. మెగా కోడలు ఉపాసన సెన్సేషనల్ పోస్ట్
విభిన్నమైన కథాంశంతో డెబ్యూ డైరెక్టర్ పాల్ జార్జ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో తెలుగు నటుడు సునీల్, కబీర్ దూహన్ సింగ్, ర్యాపర్ బేబీ జీన్, రాజ్ తిరందాసు, వ్లాగర్-సింగర్ హనన్ షా, జగదీష్, సిద్దిక్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజ కార్యక్రమాలతో మొదలయ్యింది. ఈ కార్యక్రమాన్ని కూడా చాలా వినూత్నంగా సెట్ చేశారు మేకర్స్. లగ్జరీ కార్లు, బైక్‌లతో పూజ ఈవెంట్‌ను భలే కొత్తగా నిర్వహించారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే బాహుబలి సినిమాలో కనిపించిన చిరక్కల్ కలీదాసన్ అనే ఏనుగు ఈ పూజా కార్యక్రమంలో కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సుమారు ₹45 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు లేటెస్ట్ సెన్సేషన్ అంజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక సినిమా షూటింగ్ ను తొందరగా కంప్లీట్ చేసి ఈ ఇయర్ ఎండింగ్ లో లేదా వచ్చే ఏడాది ప్రారంభములో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.