Home » Author »Narender Thiru
హై వాల్యూమ్ ఇచ్చేలా సైలెన్సర్లను మార్చుకుని, భారీ శబ్దంతో చుట్టుపక్కల వాహనదారులను ఇబ్బందిపెడుతున్న వాహనదారులపై నవీ ముంబై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. 151 సైలెన్సర్లను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.
సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో తొలి సెంచరీ నమోదు చేసి నేటికి 32 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా అప్పటి జ్ఞాపకాల్ని బీసీసీఐ గుర్తు చేసింది. ఒక ఫొటోను కూడా విడుదల చేసింది.
సల్మాన్ రష్దీపై దాడి జరగక ముందే మరో రచయిత్రిని చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇరాన్‌కు చెందిన ఒక తీవ్రవాద సంస్థ సానుభూతిపరుడు ఒక ట్వీట్ రిప్లై ద్వారా జేకే రౌలింగ్ను హెచ్చరించాడు.
గత ఏడాది ప్రధాని మోదీని రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కలిశారు. అక్టోబర్‌లో జరిగిన ఈ భేటీ అప్పట్లో వివాదాస్పదమైంది. దీనికి రెండు కారణాలున్నాయి.
స్టాక్ మార్కెట్లో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పట్టిందల్లా బంగారమే అంటుంటారు విశ్లేషకులు. ఎందుకంటే ఆయన కొనుగోలు చేసిన షేర్లన్నీ దాదాపు లాభాలు కురిపించినవే.
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతికి తోడ్పడ్డారని కొనియాడారు. కేంద్ర మంత్రులు, క్రీడా, రాజకీయ, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులు కూడా సంతాపం ప్రకటిస్తున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఆదివారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఫన్నీ వీడియో ఇది. బాటిల్ మూతపై కూర్చున్న ఒక కప్ప, మరో కప్పను బాటిల్‌పైకి రాకుండా అడ్డుకుంటుంది. ఈ వీడియో 13 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకెళ్తోంది.
న్యూయార్క్ నగరంలో జరిగిన దాడిలో గాయపడ్డ రచయిత సల్మాన్ రష్దీకి వెంటిలేటర్ తొలగించినట్లు, ఆయన మాట్లాడగలుగుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని రష్దీ ప్రతినిధి ఆండ్రూ వెల్లడించారు. ఈ దాడిని ఇరాన్ మీడియా సమర్ధించింది.
ఢిల్లీలో జరగబోయే స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలకు ఎర్రకోట ముస్తాబవుతోంది. ఎర్రకోట వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు ఈ వేడుకలకు హాజరవుతారు.
దేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. తాజాగా ఢిల్లీలో ఒక మహిళకు మంకీపాక్స్ నిర్ధరణ అయింది. ప్రస్తుతం ఆమె అక్కడి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. ఇది ఢిల్లీలో ఐదో మంకీపాక్స్ కేసుకాగా, దేశంలో పదో కేసు.
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో నిజమైనదేనని, అందులో ఎలాంటి ఎడిటింగ్, మార్ఫింగ్ వంటివి జరగలేదని అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చినట్లు టీడీపీ ప్రకటించింది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు.
తీవ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారన్న కారణంతో నలుగురు ఉద్యోగుల్ని జమ్ము-కాశ్మీర్ ప్రభుత్వం తొలగించింది. రాజ్యాంగంలోని 311 ప్రకారం.. ఎటువంటి విచారణ లేకుండానే వీరిని ఉద్యోగంలోంచి తొలగించారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జైరామ్ రమేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్న భారత్‌కు అనేక దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, తాజాగా అంతరిక్షం నుంచి కూడా శుభాకాంక్షలు అందాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పనిచేస్తున్న సమంత అనే వ్యోమగాగి భారత్‌కు శుభా�
చైనా మాంజా ఒక యువకుడి ప్రాణాలు తీసింది. సోదరిని కలిసేందుకు బైక్‌పై వెళ్తున్న అతడి గొంతు కోసింది. దీంతో తీవ్ర రక్తస్రావమైన అతడ్ని భార్య ఆస్పత్రికి చేర్చింది. కానీ, అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు.
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఒక వీడియో విడుదల చేశారు. మునుగోడులో పాదయాత్ర చేపట్టబోయే ముందు ఈ వీడియో విడుదల చేయడం విశేషం.
ప్రపంచం అవయవదాన దినోత్సవం సందర్భంగా శనివారం బెంగళూరులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అవయవదానానికి కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై అంగీకారం తెలిపారు.
‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం సందర్భంగా దేశంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతున్న సంగతి తెలిసిందే. దీంతో జాతీయ జెండాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో 20 కోట్లకు పైగా జాతీయ జెండాలు సిద్ధమయ్యాయని అధికారులు తెలిపారు.
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి ప్రియాంక్ ఖర్గే. ప్రభుత్వ ఉద్యోగాల కోసం మగవాళ్లైతే లంచాలు ఇవ్వాల్సి వస్తుందని, ఆడవాళ్లైతే అధికారులతో గడపాల్సి వస్తోందని ఆరోపించారు.