Revanth Reddy: కోమటిరెడ్డికి సారీ చెప్పిన రేవంత్.. వీడియో విడుదల

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఒక వీడియో విడుదల చేశారు. మునుగోడులో పాదయాత్ర చేపట్టబోయే ముందు ఈ వీడియో విడుదల చేయడం విశేషం.

Revanth Reddy: కోమటిరెడ్డికి సారీ చెప్పిన రేవంత్.. వీడియో విడుదల

Updated On : August 13, 2022 / 10:57 AM IST

Revanth Reddy: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణలు తెలిపారు. నల్గొండ జిల్లా చుండూరులో ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన సభలో కోమటిరెడ్డి వెంకట రెడ్డిపై అద్దంకి దయాకర్ పరుష పదజాలం ఉపయోగించి దూషించిన సంగతి తెలిసిందే.

Karnataka: అధికారులతో గడిపితేనే మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాలు.. కర్ణాటక ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత ఆరోపణ

దీనిపై కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దంకిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాజాగా ఈ అంశంపై రేవంత్ స్పందించారు. మునుగోడులో పాదయాత్ర చేపట్టబోతున్న రేవంత్.. ఈ యాత్రకు ముందు వివాదానికి ముగింపు పలుకుతూ క్షమాపణలు చెప్పారు. చుండూరు సభలో కోమటిరెడ్డిని అవమానించేలా అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరారు. దీనిపై ట్విట్టర్ వేదికగా ఒక వీడియో విడుదల చేశారు. ‘‘హోంగార్డ్ ప్రస్తావనతోపాటు, అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కోరుతున్నా. సభలో పరుషమైన పదజాలం వాడినందుకు పీసీసీ చీఫ్‌గా సారీ చెబుతున్నా. అవమానించే విధంగా ఎవరు మాట్లాడినా సరికాదు.

Har Ghar Tiranga: ‘హర్ ఘర్ తిరంగా’ కోసం 20 కోట్ల జాతీయ జెండాలు సిద్ధం

తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా క్రమశిక్షణా కమిటీని కోరుతున్నా’’ అని తన వీడియోలో రేవంత్ పేర్కొన్నారు. ఈ వీడియోను కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ట్యాగ్ చేశారు.