Karnataka: అధికారులతో గడిపితేనే మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాలు.. కర్ణాటక ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత ఆరోపణ

కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి ప్రియాంక్ ఖర్గే. ప్రభుత్వ ఉద్యోగాల కోసం మగవాళ్లైతే లంచాలు ఇవ్వాల్సి వస్తుందని, ఆడవాళ్లైతే అధికారులతో గడపాల్సి వస్తోందని ఆరోపించారు.

Karnataka: అధికారులతో గడిపితేనే మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాలు.. కర్ణాటక ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత ఆరోపణ

Karnataka: కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే మగవాళ్లైతే లంచాలు ఇవ్వాలని, యువతులైతే అధికారులతో గడపాల్సి వస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో జరిగిన స్కామ్‌పై ప్రత్యేక విచారణ బృందం (సిట్)తో విచారణ జరిపించాలని ప్రియాంక్ డిమాండ్ చేశారు.

RBI Key Instructions: వారికి రాత్రి 7 దాటితే ఫోన్ చేయొద్దు.. బ్యాంకులు, రుణ సంస్థలకు ఆర్‌బీఐ కీలక ఆదేశాలు

కర్ణాటకలో బీజేపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం చేపడుతున్న నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై శుక్రవారం ప్రియాంక్ ఖర్గే మీడియాతో మాట్లాడారు. ‘‘బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాల్ని అమ్ముకోవాలనుకుంటోంది. ఉద్యోగం కావాలంటే మగవాళ్లు లంచాలు ఇవ్వాల్సి వస్తోంది. ఆడవాళ్లైతే ఎవరో ఒకరితో గడపాల్సి వస్తుంది. ఒక మహిళకు ఉద్యోగం రావాలంటే తనతో పడుకోవాలని మంత్రి అడిగాడు. ఈ అంశం ఆధారాలతో సహా బయటపడటంతో అతడు రాజీనామా చేశాడు. ఇటీవల కర్ణాటక పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 1,492 ఉద్యోగాల భర్తీ జరిగింది. అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ వంటి పోస్టుల్ని భర్తీ చేశారు. ఒక అభ్యర్థి బ్లూటూత్ పెట్టుకుని పరీక్ష రాస్తుండగా దొరికిపోయాడు.

Aamir Khan With Indian Flag : ఒకరోజు ముందుగానే.. ఆమిర్ ఖాన్ ఇంటిపై ఎగిరిన మువ్వ‌న్నెల జెండా

నాకున్న సమాచారం ప్రకారం.. ఇందులో 600 ఉద్యోగాలు అమ్ముకునేందుకు ఒప్పందం జరిగింది. అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగానికి 50 లక్షలు, జూనియర్ ఇంజనీర్ ఉద్యోగానికి రూ.30 లక్షలు వసూలు చేశారు. మొత్తంగా రూ.300 కోట్ల స్కాం జరిగినట్లు అంచనా. ఇలా అయితే ప్రతిభ కలిగిన వాళ్లు, పేదలు ఏమైపోవాలి? 3 లక్షల మంది అభ్యర్థుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటోంది. దీనిపై విచారణ జరిపించాలి’’ అని ఖర్గే డిమాండ్ చేశారు.