Aamir Khan With Indian Flag : ఒకరోజు ముందుగానే.. ఆమిర్ ఖాన్ ఇంటిపై ఎగిరిన మువ్వ‌న్నెల జెండా

కేంద్రం ప్ర‌క‌ట‌న మేర‌కు ఓ రోజు ముందుగానే బాలీవుడ్ మిస్ట‌ర్ పెర్‌ఫెక్ష‌నిస్ట్ ఆమిర్ ఖాన్ స్పందించాడు. త‌న నివాసంలోని బాల్కనీపై జాతీయ జెండాను ఎగుర‌వేశారు. మువ్వన్నెల జెండా ప‌క్క‌నే నిల‌బడి తీసుకున్న ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆమిర్ ఖాన్.

Aamir Khan With Indian Flag : ఒకరోజు ముందుగానే.. ఆమిర్ ఖాన్ ఇంటిపై ఎగిరిన మువ్వ‌న్నెల జెండా

Aamir Khan With Indian Flag : దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ పేరుతో కేంద్రం భారీ ఎత్తున కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా దేశంలోని పౌరులంతా ఈ నెల 13 (శ‌నివారం) నుంచి 15 (సోమ‌వారం) వ‌ర‌కు త‌మ ఇళ్ల‌పై జాతీయ జెండాల‌ను ఎగుర‌వేయాలంటూ స్వ‌యంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్ర‌ధాని పిలుపున‌కు భారీ స్పంద‌న ల‌భిస్తోంది.

కాగా, కేంద్రం ప్ర‌క‌ట‌న మేర‌కు ఓ రోజు ముందుగానే బాలీవుడ్ మిస్ట‌ర్ పెర్‌ఫెక్ష‌నిస్ట్ ఆమిర్ ఖాన్ స్పందించాడు. త‌న నివాసంలోని బాల్కనీపై జాతీయ జెండాను ఎగుర‌వేశారు. మువ్వన్నెల జెండా ప‌క్క‌నే నిల‌బడి తీసుకున్న ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆమిర్ ఖాన్. తన సినిమా లాల్ సింగ్ చద్దా రిలీజ్ అయిన నెక్స్ట్ డే నే.. ఆమిర్ ఖాన్ తన ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

కాగా, ఆమిర్ ఖాన్ రీసెంట్ మూవీ లాల్ సింగ్ చద్దా. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం యావరేజ్ టాక్ ను తెచ్చుకుంది. ఎన్నో వివాదాల నడుమ, భారీ అంచనాల మధ్య లాల్ సింగ్ చద్దా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ జంటగా నటించిన లాల్ సింగ్ చద్దా ఆగస్ట్ 11న విడుదలైంది. ఈ సినిమా టామ్ హాంక్స్ ప్రధాన పాత్రలో నటించిన 1994 అమెరికన్ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’ కి రీమేక్ గా తెరకెక్కింది. హాలీవుడ్‌ లో ఈ సినిమా సూపర్‌ హిట్ అయింది. నాగ చైతన్య ఇందులో కీలకపాత్ర పోషించాడు.

కాగా.. లాల్ సింగ్ చద్దా మూవీ రిలీజ్ కు ముందు పెద్ద వివాదమే నడిచింది. బాయ్ కాట్ లాల్ సింగ్ చద్దా హ్యాష్‌ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ లో నడిచింది. దీనిపై స్పందించిన ఆమిర్ ఖాన్‌.. అలా చేయొద్దని బతిమలాడాడు. ”నేను ప్రార్థిస్తున్నా. ప్రేక్షకులపై నాకు నమ్మకం ఉంది. నేను ఎవరి హృదయాన్ని అయినా గాయపరిచి ఉంటే అందుకు నన్ను క్షమించండి. నేను ఎవరినీ కావాలని బాధపెట్టాలని అనుకోను. ఎవరైనా సినిమాను చూడకూడదనుకుంటే, నేను వారి సెంటిమెంట్‌ ను గౌరవిస్తాను” అని అన్నాడు.

ఇండియాలో ఉండాలంటే రక్షణ లేదు.. ఇక్కడ బతకాలంటే భయం వేస్తుంది అని గతంలో ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అప్పటి నుంచి ఆమిర్ ఖాన్ సినిమా రిలీజ్‌ కు వస్తుందంటే చాలు.. సోషల్ మీడియాలో బాయ్ కాట్‌ హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్‌ లో ఉంటోంది.

75వ స్వాతంత్ర్య దినోత్సవాలకు యావత్ దేశం సిద్ధమవుతోంది. మరోవైపు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి దేశ ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. భారతీయ పోస్టల్ డిపార్ట్ మెంట్ జెండాలను పోస్టాఫీసుల ద్వారా విక్రయిస్తున్నారు. అతి తక్కువ ధరలో రూ. 25కి ఒక్కో జెండాను అమ్ముతున్నారు. గత 10 రోజుల్లో ఏకంగా ఒక కోటికి పైగా జెండాలు అమ్ముడుపోయాయని కేంద్ర ప్రసారశాఖ వెల్లడించింది.

దేశంలోని 1.5 లక్షల పోస్టాఫీసుల ద్వారా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రతి గడపకు చేరిందని తెలిపింది. పోస్టాఫీసుల్లో, ఆన్ లైన్ ద్వారా జెండాల అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పింది. దేశంలోని ఏ అడ్రస్ కైనా పోస్టల్ డిపార్ట్ మెంట్ ఉచితంగానే జెండాలను డోర్ డెలివరీ చేస్తోందని తెలిపింది. ఈపోస్ట్ ఆఫీస్ పోర్టల్ ద్వారా 1.75 లక్షల జెండాలు ఆన్ లైన్ లో అమ్ముడుపోయాయని చెప్పింది. ఈ రెండు రోజుల్లో మరింత పెద్ద సంఖ్యలో జెండాలు అమ్ముడుపోయే అవకాశం ఉంది.

 

ఆమిర్ ఖాన్ ఇంటిపై జాతీయ జెండా..