Sonia Gandhi: సోనియా గాంధీకి మళ్లీ కరోనా!

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జైరామ్ రమేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Sonia Gandhi: సోనియా గాంధీకి మళ్లీ కరోనా!

Sonia Gandhi on 'Bharat Jodo Yatra'

Updated On : August 13, 2022 / 1:04 PM IST

Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మళ్లీ కరోనా బారిన పడ్డారు. సోనియాకు కరోనా సోకినట్లు పార్టీ అధికార ప్రతినిధి జైరామ్ రమేష్ సోషల్ మీడియా ద్వారా శనివారం వెల్లడించారు. ప్రస్తుతం సోనియా గాంధీ కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ ఐసోలేషన్‌లో ఉన్నారని ఆయన తెలిపారు. సోనియా మూడు నెలల వ్యవధిలో కరోనా బారిన పడటం ఇది రెండోసారి.

Revanth Reddy: కోమటిరెడ్డికి సారీ చెప్పిన రేవంత్.. వీడియో విడుదల

గత జూన్ నెలలోనే సోనియాకు కరోనా సోకింది. అప్పుడు కొంత అస్వస్థతకు గురైన ఆమె, కొద్దిరోజులు స్థానిక గంగారాం ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అనంతరం కోలుకుని ఇంటికి చేరారు. తర్వాత గత నెలలో నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన ఈడీ విచారణకు కూడా హాజరయ్యారు. అయితే, తాజాగా మరోసారి కరోనా బారినపడ్డారు. సోనియా కుమార్తె ప్రియాంకా గాంధీకి కూడా నాలుగు రోజుల క్రితమే కరోనా సోకింది. ఆమె కూడా ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించారు.