I-Day celebration:స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న ఎర్రకోట.. పటిష్ట భద్రత ఏర్పాటు

ఢిల్లీలో జరగబోయే స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలకు ఎర్రకోట ముస్తాబవుతోంది. ఎర్రకోట వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు ఈ వేడుకలకు హాజరవుతారు.

I-Day celebration:స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న ఎర్రకోట.. పటిష్ట భద్రత ఏర్పాటు

Updated On : August 13, 2022 / 3:57 PM IST

I-Day celebration: భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలకు ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబవుతోంది. ఇటీవలి తీవ్రవాద దాడులతోపాటు, ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఎర్రకోట వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు ఈ వేడుకలకు హాజరవుతారు.

Gorantla Madhav Video: గోరంట్ల వీడియో నిజమైనదే.. అమెరికన్ ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చిందన్న టీడీపీ

వరుసగా మూడో ఏడాది కూడా కరోనా ఆంక్షల మధ్యే వేడుకలు జరగబోతున్నాయి. వీక్షకులు భౌతిక దూరం పాటిస్తూ, కరోనా నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని హోదాలో మోదీ ఇక్కడ జెండా ఎగురవేయనుండటం ఇది తొమ్మిదవసారి. ఎర్రకోట చుట్టూ దాదాపు 10 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల వెయ్యి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. భద్రత పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్స్, మొబైల్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. 100 వరకు పోలీసు వాహనాలు, పీసీఆర్ వ్యాన్లు, క్విక్ రెస్పాన్స్ బృందాలు మోహరించాయి. ఎర్రకోట పరిసరాల్లో షార్ప్ షూటర్స్, ఎన్ఎస్‌జీ స్నైపర్లు, ఎలైట్ స్వాట్ కమాండోలు, డాగ్ స్క్వార్డ్‌లను మోహరించారు.

Karnataka: అధికారులతో గడిపితేనే మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాలు.. కర్ణాటక ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత ఆరోపణ

డ్రోన్ దాడులు జరగొచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. కోటలోని పరిసరాలు బయటకు కనిపించకుండా, ఇతర వ్యక్తులు లోపలికి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎర్రకోట చుట్టూ ఎనిమిది మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆగస్టు 15 ఉదయం 10 గంటల వరకు సెంట్రల్ ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఢిల్లీలో పారా గ్లైడింగ్, హాట్ ఎయిర్​ బెలూన్, రిమోట్ పైలట్ ఎయిర్​ క్రాఫ్ట్​లపై కూడా ఆగస్టు 16 వరకు నిషేధం విధించారు.