Rakesh Jhunjhunwala: వివాదాస్పదమైన మోదీ, రాకేష్ ఝున్‌ఝున్‌వాలా భేటీ.. కారణమేంటో తెలుసా!

గత ఏడాది ప్రధాని మోదీని రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కలిశారు. అక్టోబర్‌లో జరిగిన ఈ భేటీ అప్పట్లో వివాదాస్పదమైంది. దీనికి రెండు కారణాలున్నాయి.

Rakesh Jhunjhunwala: వివాదాస్పదమైన మోదీ, రాకేష్ ఝున్‌ఝున్‌వాలా భేటీ.. కారణమేంటో తెలుసా!

Updated On : August 14, 2022 / 12:13 PM IST

Rakesh Jhunjhunwala: గత ఏడాది అక్టోబర్ 5న రాకేష్ ఝున్‌ఝున్‌వాలా, ప్రధాని మోదీని కలిశారు. రాకేష్, తన భార్య రేఖతో కలిసి ప్రధానిని కలుసుకున్నారు. అయితే, ఈ భేటీ అప్పట్లో వివాదాస్పదమైంది. రాకేష్‌ను కలిసిన తర్వాత ప్రధాని మోదీ ఒక ట్వీట్ చేశారు. ఆయనను కలవడం సంతోషంగా ఉందని, ఆయన దేశంపై ఆశావాదం కలిగి ఉన్నారని ప్రధాని ట్వీట్ చేశారు.

Rakesh Jhunjhunwala: ఇండియన్ వారెన్ బఫెట్.. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పట్టిందల్లా బంగారమే

ఇది జరిగిన వారం రోజుల్లోపే రాకేష్ భాగస్వామిగా ఉన్న ‘ఆకాశ ఎయిర్’ అనే విమానయాన సంస్థకు కేంద్రం అనుమతులిచ్చింది. దీంతో ఈ సంస్థకు కేంద్రం అనుమతులు ఇవ్వడానికి, ప్రధానిని రాకేష్ కలవడానికి సంబంధం ఉందని ప్రచారం జరిగింది. తన సంస్థకు అనుమతు కోసమే రాకేష్, ప్రధానిని కలిశారని విపక్షాలు విమర్శించాయి. అలాగే వీరిద్దరి భేటీ సందర్భంగా విడుదలైన ఒక ఫొటోలో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కూర్చుని ఉంటే, ప్రధాని మోదీ నిలబడి, చేతులు ముడుచుకుని ఉన్నారు. దీంతో ఈ ఫొటోపైనా వివాదం చెలరేగింది.

Rakesh Jhunjhunwala: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం

ప్రధాన మంత్రి ఒక వ్యాపారి ముందు చేతులు కట్టుకుని నిలబడటం ఏంటని విపక్షాలు విమర్శించాయి. అయితే, రాకేశ్ అనారోగ్య సమస్యలతో వీల్ చెయిర్‌కు పరిమితం కావడం వల్లే ఆయన కూర్చుని ఉండాల్సి వచ్చిందని, ఆయనకు దగ్గరగా ప్రధాని నిలబడ్డారని బీజేపీ వివరణ ఇచ్చింది. ఈ విషయంలో రాకేష్ తీరుపై విమర్శలు వచ్చాయి.