Rakesh Jhunjhunwala: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మృతిపై ప్రధాని, ప్రముఖుల సంతాపం

రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతికి తోడ్పడ్డారని కొనియాడారు. కేంద్ర మంత్రులు, క్రీడా, రాజకీయ, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులు కూడా సంతాపం ప్రకటిస్తున్నారు.

Rakesh Jhunjhunwala: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మృతిపై ప్రధాని, ప్రముఖుల సంతాపం

Updated On : August 14, 2022 / 10:54 AM IST

Rakesh Jhunjhunwala: స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మృతిపై ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ‘‘రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు అసాధారణ పట్టుదల ఉండేది. ఆయన చమత్కారమైన, తెలివైన వ్యక్తి. ఆర్థిక ప్రగతికి ఎంతగానో తోడ్పడ్డారు. దేశ ప్రగతికి కట్టుబడేవారు. ఆయన మృతి దిగ్భ్రాంతి కలిగించింది. రాకేష్ కుటుంబ సభ్యులకు నా సానుభూతి. ఓం శాంతి’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

Rakesh Jhunjhunwala: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్ కూడా స్పందించారు. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మరణం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. సంపద సృష్టిలో ఆయన కోట్లాది మందికి ఆదర్శమని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా కూడా రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మృతిపై సంతాపం ప్రకటించారు. ప్రముఖ రాజకీయ నేతలు ప్రకాష్ జవదేకర్, శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది, కర్ణాకట మంత్రి డా.సుధాకర్, కేంద్ర మంత్రి సుశీల్ గైక్వాడ్, మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌తోపాటు రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మృతిపై సంతాపం ప్రకటిస్తున్నారు.