Home » Author »Narender Thiru
కనీస అవసరాలైన విద్య, వైద్యం పేదలకు ఉచితంగా అందించడం తాయిలాల కిందకు రావని అభిప్రాయపడ్డారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. దేశంలో ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, నాణ్యమైన వైద్య సేవలు అందాలని ఆకాంక్షించారు.
జమ్ము-కాశ్మీర్లో తీవ్రవాదులు దురాగతానికి పాల్పడ్డారు. ఒక కాశ్మీరీ పండిట్‌ను కాల్చి చంపారు. ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీవ్రవాదుల కోసం గాలిస్తున్నారు.
అమర్నాథ్ వద్ద విధులు ముగించుకుని తిరుగు ప్రయాణమైన జవాన్లలో ఆరుగురు బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మంగళవారం ఉదయం పహల్గాం ప్రాంతంలో జరిగింది.
భారత అభ్యంతరాల్ని పట్టించుకోకుండా చైనా నౌక శ్రీలంకలోని హంబన్‌తోట పోర్టుకు చేరుకుంది. మంగళవారం ఉదయం ఈ నౌక శ్రీలంక తీరంలో అడుగుపెట్టింది. మన రక్షణ వ్యవస్థ ఈ నౌక నిఘా పరిధిలోకి వస్తుందని అంచనా.
అఖిల భారత్ ఫుట్‌బాల్ సమాఖ్యకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థను సస్పెండ్ చేస్తున్నట్లు అంతర్జాతీయ ఫుట్‌బాల్ నిర్వహణా సంస్థ ‘ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆఫ్ ఫుట్‌బాల్ అసోసియేషన్’ ప్రకటించింది.
దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా త్వరలో ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోకి ప్రవేశించబోతుంది. రాబోయే నాలుగేళ్లలో ఐదు రకాల ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ఈ సంస్థ విడుదల చేయబోతుంది.
ఉప ఎన్నిక నోటిఫికేషన్‌కు ముందే మునుగోడులో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ప్రధాన పార్టీలు అప్పుడే ప్రచారం ప్రారంభించాయి. నేతల చేరికలు, ప్రచార రథాలతో అంతా ఎన్నికల సందడి నెలకొంది.
ఒక వర్గం వాళ్లు వీర్ సావర్కర్ ఫ్లెక్స్ ఏర్పాటు చేయడంతో మరో వర్గం వాళ్లు అభ్యంతరం చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. చివరికి పోలీసులు లాఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
బిహార్‌లో నేడు మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మొత్తం 31 మందికి సీఎం నితీష్ కుమార్ మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. అత్యధికంగా ఆర్జేడీకి 16 మంత్రి స్థానాలు దక్కే అవకాశాలున్నాయి.
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో విషాదం జరిగింది. జాతీయ పతాకాన్ని ఎగరేసేందుకు ప్రయత్నిస్తూ ఇద్దరు వ్యక్తులు విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాయపడ్డారు.
ఒక అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌కు సరదాగా పంపిన మెసేజ్ విమానం నిలిచిపోయేందుకు కారణమైంది. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో ఆదివారం జరిగింది. ఇంతకీ ఇద్దరి మధ్యా జరిగిన చాటింగ్ సంగతి ఏంటంటే..
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుటుంబాన్ని చంపుతామంటూ తాజాగా గుర్తు తెలియని వ్యక్తి నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
జనగామ జిల్లాలో బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత తలెత్తింది. దేవరుప్పల వద్ద బీజేపీ-టీఆర్ఎస్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరుపార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాన్ని ఇండియన్ నేవీ ఘనంగా నిర్వహించింది. ఆరు ఖండాలు, మూడు సముద్రాల్లోని ఆరు టైమ్ జోన్లలో ఈ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా అక్కడి భారత యుద్ధ నౌకలపై మన జాతీయ జెండాను ఎగరవేశారు.
ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్ర్య దినోత్సవాల్లో ప్రధాని ఉత్సాహంగా గడిపారు. చిన్నారుల వద్దకు వెళ్లిన మోదీ, వారికి అభివాదం చేస్తూ, అంతా కలియతిరిగారు. చిన్నారుల్ని డాన్స్ చేయమని ప్రోత్సహించారు.
జాతీయ జెండా మనదేశ స్వాతంత్ర్యానికి, అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక అన్నారు ఏపీ సీఎం జనగ్ మోహన్ రెడ్డి. ఏపీ, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం జరిగిన 75వ స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో సీఎం జగన్ పాల్గొన్నారు.
పోస్టల్ సర్వీసుల కోసం మొదలైన పిన్‌కోడ్ ఏర్పడి నేటితో యాభై ఏళ్లు పూర్తయ్యాయి. భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేళ.. దేశంలో గుర్తు చేసుకోవాల్సిన మరో విశేషమిది. పిన్‌కోడ్‌కు ఇది గోల్డెన్ జూబ్లీ ఇయర్.
బాలీవుడ్ మూవీ ‘స్పెషల్ 26 (తెలుగులో సూర్య హీరోగా వచ్చిన గ్యాంగ్)’ స్ఫూర్తితో ఢిల్లీలో దోపిడీకి పాల్పడిందో ముఠా. ముంబై పోలీసులమని చెప్పుకొని దాదాపు ఏడు లక్షల రూపాయలు దోచుకెళ్లారు.
తీవ్రవాదులతో పోరులో ప్రాణాలు విడిచిందో శునకం. పేరు యాక్సెల్. గత నెల తీవ్రవాదికి, సైన్యానికి మధ్య జరిపిన కాల్పుల్లో యాక్సెల్ వీర మరణం పొందింది. యాక్సెల్ త్యాగాన్ని కేంద్రం గుర్తించింది.
మెస్‌లో ఆహారం బాగోలేదని ఆరోపించిన యూపీ కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు వేధింపులకు గురి చేస్తున్నారు. అతడిని బలవంతంగా సెలవులపై పంపించారు. మెస్‌లో అందిస్తున్న ఆహారం బాగాలేదని ఒక కానిస్టేబుల్ ఏడుస్తూ చెప్పిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెల�