Home » Author »Narender Thiru
దేశ ప్రజలంతా సామూహికంగా జరుపుకొనే స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కోవిడ్ మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్రం ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది.
గత నెల నుంచి కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం ఇంటి అద్దెపై కూడా 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందే. అయితే, అందరూ జీఎస్టీ చెల్లించాల్సిందేనా? యజమాని, అద్దెకు ఉండే వాళ్లు.. ఇద్దరూ జీఎస్టీ చెల్లించాలా? ఎవరు జీఎస్టీ పరిధిలోకి వస్తారు?
దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తయారు చేసే బేబీ పౌడర్ అమ్మకాలు వచ్చే ఏడాది నుంచి నిలిచిపోనున్నాయి. ఈ మేరకు సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.
మునుగోడులో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సమావేశాలకు తనను పిలవకపోవడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. పిలవని పేరంటానికి వెళ్లాలా అని ప్రశ్నించారు. ఈ అంశంపై శుక్రవారం 10టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.
అక్రమంగా నిర్మించిన భారీ కట్టడమైన నోయిడాలోని సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేతకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 28న ఈ టవర్స్ కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. దీని కోసం బిల్డింగులో పేలుడు పదార్థాలు అమరుస్తున్నారు.
తనకు ప్రధాని కావాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు బిహార్ సీఎం నితీష్ కుమార్. ఈ అంశంపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఎవరో చేస్తున్న ప్రచారాన్ని తాను పట్టించుకోనని చెప్పారు. బిహార్‌లోనే ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు.
తెలంగాణలో గత నెల నిర్వహించిన ఎంసెట్, ఈసెట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో ఫలితాల్ని విడుదల చేశారు.
జమ్ము-కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో బిహార్‌కు చెందిన వలస కూలీ ప్రాణాలు కోల్పోయారు. గురువారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగింది. తీవ్రవాదుల దాడులు జరగడం రెండు రోజుల్లో వరుసగా ఇది రెండోసారి.
ఆన్లైన్లో విస్కీ కొనేందుకు ప్రయత్నించిన ఒక మహిళ రూ.5.3 లక్షలు పోగొట్టుకుంది. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. కేటుగాళ్లు అడిగిన వెంటన బ్యాంకు డీటైల్స్, డెబిట్ కార్డు వివరాలు, సీవీవీ వంటివి చెప్పడం వల్లే ఆమె భారీగా నష్టపోయింది.
దివ్యా కాక్రన్ అంశంలో ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకవైపు ఆప్ ప్రభుత్వం తనకేం సాయం చేయడం లేదని దివ్య అంటే.. తామేం సహాయం చేశామో ఆప్ ప్రకటించింది. మరోవైపు ఆప్ తీరును బీజేపీ తప్పుబడుతోంది.
నిబంధనలకు విరుద్ధంగా విమానంలో సిగరెట్ వెలిగించుకున్నాడు బాబీ కటారియా. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా పేరుపొందిన అతడి అనుచిత, బాధ్యతారాహిత్య ప్రవర్తనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అతడిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
తల్లిదండ్రులు ప్రమాదవశాత్తు మరణిస్తే.. పెళ్లైన కూతుళ్లకు కూడా ఇన్సూరెన్స్‌లో వాటా ఇవ్వాలని కర్ణాటక హై కోర్టు ఆదేశించింది. జస్టిస్ హెచ్‌పీ సందేశ్ ధర్మాసనం తాజా తీర్పునిచ్చింది.
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాఖీ వేడుకలు జరుపుకొన్నారు. ప్రధానికి చిన్నారులు రాఖీలు కట్టారు. ప్రధాని కార్యాలయ సిబ్బంది పిల్లలు వరుసగా ఆయన చేతికి రాఖీలు కట్టారు.
దివంగత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సతీమణి వై.ఎస్.విజయమ్మ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు టైరు పేలింది. అయితే, ఆమె సురక్షితంగా బయటపడ్డారు.
కోటి రూపాయలు గెలుచుకున్న యువకుడిని అతడి స్నేహితులే కిడ్నాప్ చేశారు. అతడి తండ్రికి ఫోన్ చేసి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే చంపేస్తామని బెదిరించారు.
దేశీయ విమానయాన సంస్థలకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. టిక్కెట్ ధలరపై విధించిన పరిమితిని తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 నుంచి ఈ నిర్ణయం అమలవుతుంది.
బికినీ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు కోల్‌కతాలోని సెయింట్ జేవియర్ యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ ఉద్యోగం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడా ప్రొఫెసర్.. యూనివర్సిటీపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు.
జమ్మూలో సైనిక స్థావరంపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించారు ఇద్దరు తీవ్రవాదులు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిపై కాల్పులు ప్రారంభించారు. ఈ క్రమంలో తీవ్రవాదులకు, సైనికులకు మధ్య కాల్పులు జరిగాయి.
భారత నూతన ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖడ్ నేడు ప్రమాణ స్వీకారం చేయబోతునున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గురువారం ఉదయం 11:45కి జగదీప్ ధన్‌ఖడ్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
క్లబ్బుకు వచ్చిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు బౌన్సర్లు. అంతేకాదు.. ఈ విషయంపై ప్రశ్నించినందుకు ఆమె స్నేహితులతోపాటు, ఆమెపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.