Home » Author »Narender Thiru
డెలివరీ పేషెంట్‌ను వదిలేసి డాక్టర్ మార్నింగ్ వాక్కు వెళ్లడంతో రక్తస్రావం జరిగి పేషెంట్ మృతి చెందింది. డాక్టర్ నిర్లక్ష్యమే దీనికి కారణమని అధికారులు గుర్తించారు. ఆమెపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
75వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలు సోమవారం ఉదయం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 8-22 వరకు ఈ వేడుకలు జరుగుతాయి.
రామాయణంపై నిర్వహించిన ఆన్లైన్ క్విజ్‌లో ముస్లిం విద్యార్థులు విజయం సాధించారు. కేరళకు చెందిన ఒక సంస్థ ఈ క్విజ్ నిర్వహించగా, ఇద్దరు ముస్లిం విద్యార్థులు విజేతలుగా నిలిచారు.
దేశంలో పేలుళ్లకు కుట్ర పన్నిన ఐఎస్ తీవ్రవాద సంస్థ సభ్యుడిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. మోసిన్ అహ్మద్ అనే నిందితుడు దేశంలోని ఐఎస్ సానుభూతి పరుల నుంచి విరాళాలు సేకరిస్తూ సిరియాకు పంపుతున్నాడు.
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ విజయపరంపర కొనసాగుతోంది. బాక్సింగ్‌లో ఆదివారం భారత్‌కు మూడో స్వర్ణం దక్కింది. తాజా ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ 50 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది.
మన దేశంలో స్వచ్ఛమైన ఆవు పేడతో రాఖీలను కూడా తయారు చేస్తున్నారు. అంతేకాదు.. వీటిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి అమెరికా, మారిషస్‌కు ఇటీవల దాదాపు 60,000కు పైగా రాఖీలు ఎగుమతయ్యాయి.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 75 క్రీడలకు స్కూళ్లలో చోటు కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో ఆడే గిల్లీ దండా, ఖోఖో వంటి వాటికి చోటు దక్కింది. మొత్తం 75 ఆటలు ఇకపై స్కూళ్లలో తప్పనిసరిగా ఆడా�
శనివారం రాత్రి.. ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ టామాక్ ఏరియాలో విమాన ప్రయాణికులు నడుచుకుంటూ వెళ్లిన ఘటనపై డీజీసీఏ సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.
ఆదివారం ఉదయం చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ డీ1 ప్రయోగం విఫలమైందని అధికారికంగా ప్రకటించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఈ రాకెట్ మోసుకెళ్లిన రెండు ఉపగ్రహాలు ఇకపై నిరుపయోగంగా ఉంటాయని తెలిపింది.
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. ఆదివారం జరిగిన పలు విభాగాల మ్యాచుల్లో దేశానికి పతకాల పంట పండించారు. బాక్సింగ్‌లో రెండు బంగారు పతకాలు గెలుచుకోగా, 16 సంవత్సరాల తర్వాత భారత మహిళల హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుంద�
అతడో నకిలీ ట్రాఫిక్ పోలీసు. రోజూ వారిలాగా డ్రెస్ చేసుకుని, నిజమైన ట్రాఫిక్ పోలీసులతో కలిసి పోయి డ్యూటీ చేసేవాడు. చలాన్ల పేరుతో అక్రమ వసూళ్లే అతడి లక్ష్యం. మిగతా పోలీసులకు అనుమానం వచ్చి ఆరాతీయగా అసలు విషయం తెలిసింది.
ఐదేళ్ల చిన్నారికి దెయ్యం పట్టిందని భావించిన కుటుంబం క్షుద్రపూజలు నిర్వహించింది. క్షుద్రపూజల్లో భాగంగా పాప తల్లిదండ్రులతోపాటు, అత్తమ్మ కూడా చిన్నారిని దారుణంగా కొట్టారు. దీంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
స్పాలో పని చేసే ఒక యువతిపై మేనేజర్‌తోపాటు, కస్టమర్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధిత మహిళ ఢిల్లీ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన కమిషన్.. పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
సహచరులపై సీఐఎస్ఎఫ్ జవాన్ జరిపిన కాల్పుల్లో ఒక జవాను మరణించారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియమ్ వద్ద శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భారత 16వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు జగదీప్ ధన్కర్. ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ప్రతిపక్షాల అభ్యర్థి మార్గరేట్ ఆళ్వాపై 346 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ నెల 11న ఆయన ప్రమాణం చేస్తారు.
నీతి ఆయోగ్ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆ సంస్థ ఖండించింది. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొనకూడదని కేసీఆర్ నిర్ణయించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఈ అంశంపై ఒక ప్రకటన విడుదల చేసింది.
కామన్వెల్త్లో చరిత్ర సృష్టించేందుకు భారత మహిళా క్రికెట్ జట్టు రెడీ అవుతోంది. సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై గెలుపొందడం ద్వారా ఫైనల్‌కు చేరి, భారత్‌కు మరో పతకాన్ని ఖాయం చేసింది. ఆదివారం రాత్రి ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
ఆడపిల్లల్ని కన్నందుకు భర్త వేధించడంతో ఒక భారతీయ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తాజాగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగింది. మృతురాలు మన్దీప్ కౌర్ స్వస్థలం ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నూర్. ఈ ఘటనపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా
ఆసక్తి రేకెత్తించిన ఉప రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. శనివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఎన్నిక సాగింది. సాయంత్రం ఆరు గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. రాత్రిలోపే ఫలితాలు వెల్లడవుతాయి.
తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం ఆయన ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు.