Home » Author »Narender Thiru
పరారీలో ఉన్న ముగ్గురు డాక్టర్లతోపాటు, ఒక మేనేజర్‌ను పట్టించినా లేదా వారి ఆచూకీ చెప్పినా పది వేల రూపాయల బహుమతి అందిస్తామని ప్రకటించారు మధ్యప్రదేశ్ పోలీసులు. ఒక్కో డాక్టర్‌కు పదివేల రూపాయలు అందిస్తామన్నారు.
ఒకప్పుడు దేశంలో కోట్లాది మంది ఫేవరెట్ యాప్ ‘టిక్‌టాక్’ మళ్లీ వచ్చే అవకాశాలున్నాయా? దీనిపై జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? ‘బీజీఎమ్ఐ’ కూడా మళ్లీ వస్తుందా?
అడుగు కూడా లేని బైకులు, సైకిళ్ల బొమ్మలు చిన్న పిల్లలు నడిపేందుకు కూడా పనికిరావు. కానీ, అంత తక్కువ పొడవున్న ఒక బైకును నడుపుతున్నాడో వృద్ధుడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
గాజాపై శుక్రవారం మధ్యాహ్నం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఎనిమిది మంది మరణించారు. మరో 40 మంది గాయపడ్డారు. గాజాలోని హమాస్ తీవ్రవాదుల్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి.
సరిహద్దులో చైనా రెచ్చగొట్టే వైఖరిని భారత్ ప్రశ్నించింది. నిబంధనలు, ఒప్పందాలను ఉల్లంఘిస్తూ తరచూ చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుండటంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆగష్టు ఐదో తేదీనే ప్రధాని మోదీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేశారని, దీనికి వ్యతిరేకం అని చెప్పే ఉద్దేశంలో భాగంగానే కాంగ్రెస్ ఈ రోజు నిరసన చేపట్టిందని అమిత్ షా విమర్శించారు.
పశ్చిమ బెంగాల్ టీచర్ల రిక్రూట్మెంట్ స్కాంలో అరెస్టైన బెంగాలీ నటి అర్పితా ముఖర్జీకి ప్రాణహాని ఉన్నట్లు ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందిందని ఈడీ తెలిపింది. అందుకే ఆమెకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయాలని కోర్టును కోరింది.
ఒక అపరిచితుడికి అసభ్య వీడియో కాల్ చేసిందో మహిళ. తర్వాత ఆ వీడియో కాల్, చాట్ వివరాల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
భారత్ సొంతంగా తయారు చేస్తున్న యుద్ధ విమానాపై మలేసియా ఆసక్తి చూపిస్తోంది. 18 యుద్ధ విమానాల్ని కొనేందుకు ముందుకొచ్చింది. దీనిపై ఇంకా అంగీకారం కుదరాల్సి ఉంది. వచ్చే ఏడాది ఈ యుద్ధ విమానాలు అందుబాటులోకి వస్తాయి.
కన్న ప్రేమను మర్చిపోయి... ఆవేశంతో కొడుకునే చంపేశాడో కసాయి తండ్రి. బైక్ కీ అడిగితే ఇవ్వలేదని మరో కొడుకుతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కొడుకు చేయి నరికేశాడు. రక్తస్రావంతో కొడుకు ప్రాణాలు కోల్పోయాడు.
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం గృహ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచే కొత్త విద్యుత్ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. దీనివల్ల కోటి మంది వినియోగదారులకు మేలు జరుగుతుంది.
హైదరాబాద్ పేరు విషయంలో కొంతకాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నగరం పేరు గతంలో భాగ్య నగర్‌గా ఉండేదని కొందరు వాదిస్తూ ఉంటారు. దీని పేరు తిరిగి భాగ్య నగర్‌గా మార్చాలని డిమాండ్ చేస్తుంటారు. అయితే, దీనిపై ఏఎస్ఐ స్పష్టతనిచ్చింది.
కన్నతల్లే నాలుగేళ్ల కూతురును చంపింది. మానసిక ఎదుగుదల లేని, మాటలు రాని కూతురును భరించడం కష్టమనుకున్న తల్లి, చివరికి తన ప్రాణాలు తీసింది. ఈ ఘటన కర్ణాటకలో గురువారం జరిగింది.
విద్యాబుద్ధులు చెప్పి విద్యార్థుల్ని తీర్చిదిద్దాల్సిన టీచరే ఒక స్టూడెంట్‌తో అనుచితంగా ప్రవర్తించాడు. ట్యూషన్ కోసం వచ్చిన పదో తరగతి బాలికకు బలవంతంగా వోడ్కా తాగించాడు. ఆ తర్వాత బాలిక స్పృహ కోల్పోయింది.
భారత్ అమ్ములపొదిలో మరో అస్త్రం చేరనుంది. భారత్ సొంతంగా తయారు చేసిన లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్ (ఏటీజీఎమ్)ను డీఆర్డీఓ, ఇండియన్ ఆర్మీ విజయవంతంగా ప్రయోగించాయి.
వాట్సాప్‌లో అభ్యంతరకర, తప్పుడు మెసేజులు వస్తే ఇకపై అడ్మిన్లే వాటిని డిలీట్ చేయొచ్చు. ఈ ఫీచర్ త్వరలో అందబాటులోకి రానుంది. దీని ద్వారా గ్రూపులో అనవసర మెసేజులకు తావుండదు.
ఒక్క పాటతో సెన్సెషన్ క్రియేట్ చేసింది యవు సింగర్ అభిలిప్సా పాండా. ‘హరహర శివ శంభు’ అనే భక్తి పాటతో శ్రోతల మనసు దోచేసింది. అభిలిప్స పాడిన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్తోంది.
ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు.. తన పొలంలో ఒక చిన్నారి చేయి మట్టిలోంచి పైకి తేలుతూ ఉండటాన్ని గమనించాడు. వెంటనే తవ్వి చూసి షాక్ తిన్నాడు. మట్టిలో పాతిపెట్టిన ఆ చిన్నారి ఇంకా ప్రాణాలతోనే ఉంది.
వచ్చే అక్టోబర్ నుంచి దేశంలో 5జీ సేవలు ప్రారంభమవుతాయని చెప్పారు కేంద్ర టెలికాం శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో 5జీ సేవలు తక్కువ ధరల్లోనే అందుబాటులో ఉంటాయన్నారు.
పై నుంచి జారిపడ్డ తమ్ముడ్ని అన్న జాగ్రత్తగా క్యాచ్ పట్టి రక్షించుకున్నాడు. తమ్ముడికి గాయాలు కాకుండా కాపాడుకోగలిగాడు. ఈ దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో అక్కడ వైరల్‌గా మారింది.