Home » Author »Narender Thiru
ప్రైవేటు అంబులెన్స్‌కు డబ్బులు చెల్లించే స్థోమత లేని ఒక వ్యక్తి కొడుకు శవాన్ని భుజాలపైనే వేసుకుని ఇంటికి బయల్దేరాడు. వర్షంలోనే దాదాపు ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాడు. చివరకు కొందరు స్థానికులు సహాయం చేశారు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం గడిచిన రెండున్నరేళ్లలో 28 లక్షల మందికిపైగా భారత పౌరులు విదేశాలకు వెళ్లారని వెల్లడించింది కేంద్రం. లోక్‌సభలో కేంద్రం తాజా గణాంకాల్ని ప్రకటించింది.
పాత్రా చాల్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా రూ.11.15 కోట్ల విలువైన వర్షా రౌత్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
స్కేట్‌బోర్డుపై కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్ర చేపట్టిన కేరళ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. యాత్ర మరో 15 రోజుల్లో పూర్తవ్వాల్సి ఉండగా, అనాస్ హజాస్ అనే యువకుడు ట్రక్కు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయాడు.
దేశంలో మంకీపాక్స్ కేసులు పెరిగిపోతున్నాయి. బుధవారం తొమ్మిదో మంకీపాక్స్ కేసు నమోదైంది. ఢిల్లీలో ఉంటున్న నైజీరియన్ మహిళకు మంకీపాక్స్ సోకినట్లు అధికారులు తెలిపారు.
అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించడం తైవాన్-చైనాల మధ్య ఉద్రిక్తతల్ని మరింత పెంచేలా ఉంది. నాన్సీ పర్యటన ముగిసిన వెంటనే చైనా తన యుద్ధ విమానాల్ని తైవాన్ గగనతలంపైకి పంపింది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాందీ షాపులు పెట్టుకునే వాళ్లంటూ రేవంత్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలన్నా
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 18న వాచీల ఈ-వేలం జరగనుంది. భక్తులు ప్రధాన ఆలయంతోపాటు, ఇతర ఆలయాల్లో సమర్పించిన వాచీలను ఈ-వేలం ద్వారా సొంతం చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది.
మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ సంస్థ కార్యాలయానికి బుధవారం ఈడీ సీల్ వేసింది. ఆఫీసులోని సాక్ష్యాలు తారుమారు అవ్వకూడదనే ఉద్దేశంతోనే సీల్ వేసినట్లు తెలుస్తోంది.
‘నాన్నా కాపాడు’ అంటూ అగ్నిప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకోవడానికి ముందు ఒక యువకుడు తన తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. ఆ మాటలు తలచుకుని తండ్రి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు.
ప్రమాదానికి గురైన తండ్రి స్థానంలో పనిచేస్తున్నాడో ఏడేళ్ల బాలుడు. రోజూ ఉదయం, సాయంత్రం సైకిల్‌పైనే తిరుగుతూ కస్టమర్లకు ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు. కష్టపడి పనిచేసే చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
కూతురుకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినందుకు వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడో తండ్రి. అంతేకాదు.. ఇంకోసారి తమ గ్రామంలోకి వస్తే వారిని చంపుతానని బెదిరించాడు. దీంతో భయపడ్డ సిబ్బంది అక్కడ్నుంచి పారిపోయి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏ క్షణమైనా పిడుగు పడొచ్చని, కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వర రావు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లాలో కార్యకర్తలతో సమావేశమయ్యారు.
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బుధవారం ఎంపీలు చేపట్టిన తిరంగా ర్యాలీకి కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు హాజరు కాలేదు. బీజేపీ రాజకీయ అజెండాలో తామెందుకు భాగస్వాములు కావాలని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. మరోవైపు ప్రతిపక్షాల చర్య�
అలిగి పుట్టింటికి వెళ్లిన భార్యను ఇంటికి తెచ్చుకునేందుకు లీవ్ కావాలని కోరాడు ఒక ప్రభుత్వ ఉద్యోగి. దీనికి ఉన్నతాధికారులు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఈ లీవ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సరదాగా నదిలో స్నానం చేసేందుకు వచ్చి నీటిలో మునిగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో సోమవారం జరిగింది. మృతుల్లో ఆరుగురు యువకులు.
స్మృతి ఇరానీకి, ఆమె కూతురు జోయిష్ ఇరానీకి గోవా బార్ అండ్ రెస్టారెంట్‌తో ఎలాంటి సంబంధం లేదని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. దీనికోసం వాళ్లు దరఖాస్తు కూడా చేయలేదని కోర్టు పేర్కొంది.
దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశమే లేదన్నారు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్. మన దేశ ఆర్థిక పరిస్థితి చాలా బాగుందని, ఆర్థిక మాంద్యానికి అవకాశం లేదని పార్లమెంటులో ప్రకటించారు.
మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఈ నెల 4 వరకు ఈడీ కస్టడీ విధిస్తూ ముంబై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సంజయ్ రౌత్‌ను ఆదివారం రాత్రి ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎంపీ ధరల పెరుగుదలపై వినూత్నంగా నిరసన తెలిపారు. ఎల్పీజీ సిలిండర్ ధరల పెంపునకు వ్యతిరేకంగా పచ్చి వంకాయను పార్లమెంట్‌కు తీసుకొచ్చారు.