Nirmala Sitharaman: దేశంలో ఆర్థిక సంక్షోభానికి అవకాశమే లేదు: నిర్మలా సీతారామన్

దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశమే లేదన్నారు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్. మన దేశ ఆర్థిక పరిస్థితి చాలా బాగుందని, ఆర్థిక మాంద్యానికి అవకాశం లేదని పార్లమెంటులో ప్రకటించారు.

Nirmala Sitharaman: దేశంలో ఆర్థిక సంక్షోభానికి అవకాశమే లేదు: నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman

Updated On : August 1, 2022 / 8:57 PM IST

Nirmala Sitharaman: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతుంది అంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. ధరల పెరుగుదల, ఆర్థిక మాంద్యం వంటి అంశాలపై లోక్‌సభలో సోమవారం నిర్మలా సీతారామన్ మాట్లాడారు. దేశ ఆర్థిక పరిస్థితి బాగుందన్నారు.

Jackfruit: పనస పండు కోసం ఏనుగు కష్టం.. వైరల్‌గా మారిన వీడియో

‘‘దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఎంతమాత్రం లేదు. బ్లూమ్‌బర్గ్ సర్వే ప్రకారం.. ఆర్థిక మాంద్యానికి అవకాశాలే లేవు. మనది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. చాలా దేశాలకంటే మన ఆర్థిక వ్యవస్థ బాగుంది. దేశంలో ఆర్థిక సంక్షోభం అనేది ఒక డాటా ఆధారంగా కంటే.. రాజకీయ చర్చగా మాత్రమే సాగుతోంది. 30 మంది ఎంపీలు ఈ రోజు ధరల పెరుగుదలపై మాట్లాడారు. అందరూ డాటా ఆధారంగా మాట్లాడాల్సింది పోయి.. రాజకీయ కోణంలోనే మాట్లాడారు. దేశ ఆర్థిక పరిస్థితి బాగుండటంపై క్రెడిట్ మొత్తం ప్రజలకే ఇస్తా. ప్రస్తుతం రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ఏడు శాతం కంటే దిగువకు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం.

Trinamool MP: పార్లమెంట్‌లోకి వంకాయ తీసుకొచ్చిన మహిళా ఎంపీ.. ఎందుకంటే..

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో దేశంలో ద్రవ్యోల్బణం తొమ్మిదిసార్లు రెండంకెలు దాటింది. 22 నెలలు తొమ్మిది శాతంపైనే కొనసాగింది’’ అని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. జూలై నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.49 లక్షల కోట్లు దాటినట్లు నిర్మల ప్రకటించారు. రూ.1.4 లక్షల కోట్లు దాటడం ఇది వరుసగా ఐదోసారి. అయితే, నిర్మలా సీతారామన్ మాట్లాడుతుండగా కాంగ్రెస్ ఎంపీలు వాకౌట్ చేశారు.