Home » Author »Narender Thiru
వారం రోజులుగా సాగిన 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ ముగిసింది. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.1.5 లక్షల కోట్ల ఆదాయం సమకూరనుంది. ఈ వేలంలో రిలయన్స్ జియో సంస్థ అత్యధికంగా 84 వేల కోట్ల బిడ్లు దాఖలు చేసింది.
ప్రైవేటు ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరగడంతో పది మంది పేషెంట్లు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో సోమవారం జరిగింది.
ఇసుక మాఫియా ఆగడాలు కొనసాగుతున్నాయి. అక్రమ ఇసుక తరలింపును అడ్డుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్‌పై ఇసుక మాఫియా దాడికి పాల్పడింది. ఆరుగురు దుండగులు కానిస్టేబుల్‌పై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు.
అత్యవసర వైద్య చికిత్స అవసరమైన వారికి 48 గంటలపాటు ఉచితంగా చికిత్స అందించాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఎక్కడైనా ఉచిత వైద్య చికిత్స పొందవచ్చు. ఈ పథకం త్వరలోనే అమల్లోకి రాబోతుంది.
పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పి, కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ప్రిన్సిపలే విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అధికారులు ఉద్యోగంలోంచి తొలగించారు.
ఆంధ్ర ప్రదేశ్‌లో మంకీపాక్స్ కేసు కలకలం రేపుతోంది. గుంటూరులో ఒక బాలుడికి మంకీపాక్స్ లక్షణాలు ఉండటంతో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
దొంగ-పోలీస్ ఆట ఆడుకుంటుండగా ఒక బాలుడి నిర్లక్ష్యం మరో బాలుడి ప్రాణం తీసింది. బాలుడి చేతిలో ఉన్న తుపాకి పొరపాటున పేలడంతో మరో బాలుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది.
దేశంలో ధరల పెరుగదల, నిరుద్యోగం, అగ్నిపథ్ స్కీం, జీఎస్టీ పెంపు వంటి అంశాలపై నిరసన చేపట్టేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. ఆగష్టు 5న దేశవ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.
ప్రముఖ భారతీయ మహిళా వ్యాపారవేత్త సావిత్రి జిందాల్ ఆసియాలోనే అత్యంత సంపన్నురాలిగా నిలిచారు. బ్లూమ్‌బర్గ్ సంస్థ ఆసియాకు సంబంధించి ప్రకటించిన మహిళా సంపన్నుల జాబితాలో ఆమె అగ్రస్థానం సాధించారు.
స్నేహితుడితో కనిపించిన భార్యను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టాడు భర్త. దాదాపు ఏడు గంటలపాటు ఆమెను చెట్టుకు కట్టేసి ఉంచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు.
హిందీ భాషను జాతీయ భాషగా మార్చాలనుకుంటున్న కేంద్రంపై తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. ఈ విధానం సరికాదన్నారు. ఒక దేశం, ఒకే భాష, ఒకే సంస్కృతి వంటివి దేశానికి శత్రువులని, అలాంటి దుష్ట శక్తులకు దేశంలో తావులేదన్నారు.
ఆదాయపు పన్ను రిటర్న్ చెల్లించేందుకు రేపే చివరి రోజు. దీంతో చాలా మంది హడావుడిగా పన్ను చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకొందరు ప్రభుత్వం గడువు పొడిగిస్తుందని ఎదురు చూస్తున్నారు.
భారీ వర్షాలకు యూఏఈ అతలాకుతలమవుతోంది. పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. నివాస ప్రాంతాలు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు నీట మునిగాయి. వరదల ప్రభావంతో ఇప్పటివరకు ఏడుగురు మరణించినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది.
ఢిల్లీలో ఇకపై పాత విధానంలోనే మద్యం విక్రయాలు జరగనున్నాయి. కొత్త లిక్కర్ పాలసీని రద్దు చేస్తూ ఆప్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ప్రభుత్వ మద్యం షాపుల్లోనే మద్యం అమ్ముతారు.
చిన్నారులు మరణించిన తర్వాత వారి పేరు మీద 30 ఏళ్లకు పెళ్లి తంతు నిర్వహిస్తున్నారు కర్ణాటకలో. అక్కడి కొన్ని ప్రాంతాల్లో ఇది చాలా ప్రాచీన సంప్రదాయం. అనేక కుటుంబాలు ఈ పెళ్లి తంతును ఘనంగా నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం అక్కడి సోషల్ మీడియాలో �
బెంగాలీ నటి అర్పితా ముఖర్జీ కోల్‌కతాలోని ఖరీదైన ఫ్లాట్లలో నివసిస్తుంటే.. ఆమె తల్లి మినాటీ ముఖర్జీ మాత్రం పాత ఇంటిలోనే జీవిస్తున్నారు. దాదాపు యాభై ఏళ్ల క్రితంనాటి పూర్వీకుల ఇంట్లోనే ఆమె ఉంటున్నారు.
చిన్న నిర్లక్ష్యం ఏకంగా మహిళ ప్రాణం తీసింది. ఎలుకల్ని చంపేందుకు విషం కలిపిన టమాటాల్ని పొరపాటున వంటలో వేసింది. ఆ తర్వాత ఆ టమాటాలతో చేసిన మ్యాగీ నూడిల్స్ తిని ప్రాణాలు కోల్పోయింది.
గుజరాతీలు, రాజస్థానీలు లేకుంటే ముంబై దేశ ఆర్థిక రాజధానిగా ఉండబోదని వ్యాఖ్యానించారు మహారాష్ట్ర గవర్నర్ బిఎస్ కొషియారి. ఈ వ్యాఖ్యలను శివసేన సహా మహారాష్ట్రకు చెందిన పార్టీలు ఖండిస్తున్నాయి.
పట్టాలపై నుంచి వెళ్తున్న మినీ బస్సును ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొంది. ఈ ఘటనలో 11 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన బంగ్లాదేశ్‌లో శుక్రవారం జరిగింది.
మంకీపాక్స్ ప్రపంచాన్ని వణికిస్తోంది. తాజాగా మంకీపాక్స్ రోగి ప్రాణాలు కోల్పోయాడు. స్పెయిన్‌లో ఒక మంకీపాక్స్ రోగి శుక్రవారం మరణించినట్లు అధికారులు తెలిపారు.